సాక్షి, బెంగళూరు (మంగళూరు): భారత నౌకాదళానికి చెందిన సుఖోయ్ తరహా యుద్ధ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని దాదాపు రెండు గంటల పాటు మూసేశారు.
దీంతో సాధారణ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానం గాల్లో ఉండగా హైడ్రాలిక్ వ్యవస్థ స్తంభించినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో దగ్గర్లోనే ఉన్న మంగళూరు విమానాశ్రయంలోని రన్ వేపై అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా వెనుక ఎడమటైరు పేలిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది భారీగా మంటల నివారక ఫోమ్‌ను జల్లారు. పలు పౌర విమానాలను బెంగళూరు తదితర విమానాశ్రయాలకు మళ్లించారు.