Mangalore airport
-
ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం
సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్‌గా పోలీసులు భావించారు. (‘అందుకే ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను’) మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్ టచ్ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్‌ను బ్యాంకు లాకర్లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్ మాస్టర్‌కు తన సిమ్ నుంచి కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు) -
‘అందుకే ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తాను ఈ చర్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. మంగళూరు ఎయిరుపోర్టు ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు(36) అనే వ్యక్తి తమకు లొంగిపోయాడని తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అతడిని మంగళూరు టీంకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్ కౌంటర్ వద్ద విమానాశ్రయ పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సదరు బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లుగా గుర్తించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. కట్టుదిట్టమెన భద్రత నడుమ సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అతడు పోలీసులకు లొంగిపోయాడు. -
మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దొరకడం కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ కట్టుదిట్టమెన భద్రతతో సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపారని సమాచారం. సీసీ కెమెరాల్లో నిందితుడు.. సీసీ కెమెరా చిత్రాల ఆధారంతో అధికారులు నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆటోలో రావడం, బ్యాగ్ ఉంచడం తదితర దృశ్యాలు విమానాశ్రయం కెమెరాల్లో రికార్డ య్యాయి. నిందితుడు మధ్యవయస్కుడు, విద్యావంతునిలా కనిపిస్తున్నాడు. బ్యాగ్‌ను కౌంటర్ వద్ద ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లిపోయాడు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. బాంబు విమానాశ్రయంలో పేలి ఉంటే మొత్తం బూడిదై పోయేదని మంగళూరు ఎస్పీ పీఎస్ హర్ష తెలిపారు. చుట్టూ 500 మీటర్ల మేర పేలుడు ప్రభావం ఉండేదన్నారు. మంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే వదంతి వ్యాపించింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించి తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ సంఘటనలతో మంగళూరులో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల మంగళూరులో ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. -
యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, బెంగళూరు (మంగళూరు): భారత నౌకాదళానికి చెందిన సుఖోయ్ తరహా యుద్ధ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని దాదాపు రెండు గంటల పాటు మూసేశారు. దీంతో సాధారణ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానం గాల్లో ఉండగా హైడ్రాలిక్ వ్యవస్థ స్తంభించినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో దగ్గర్లోనే ఉన్న మంగళూరు విమానాశ్రయంలోని రన్ వేపై అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా వెనుక ఎడమటైరు పేలిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది భారీగా మంటల నివారక ఫోమ్‌ను జల్లారు. పలు పౌర విమానాలను బెంగళూరు తదితర విమానాశ్రయాలకు మళ్లించారు. -
బూట్లలో రెండు కేజీల బంగారం
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బూట్లలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన ఇబ్రహీం ఖలీస్ కునిల్ మంగళవారం రాత్రి పది గంటలకు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో వచ్చాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీ సమయంలో అతని రెండు బూట్లలో కేజీ చొప్పున రెండు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.54.2 లక్షలని అధికారులు అంచనా వేశారు. అనంతరం అతన్ని మంగళూరు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్. పాటిల్ ఎదుట హాజరు పరచగా, ఈ నెల 17 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించారు.