సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పీఎస్‌యూ బ్యాంకులకు రూ 70,000 కోట్ల అదనపు మూలధనం కేటాయిస్తామని తెలిపారు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతా కలిగిన ఖాతాదారు అన్ని పీఎస్‌యూ బ్యాంకు సేవలను అందుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు. పార్లమెంట్‌లో శుక్రవారం ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల స్ధితిగతులు మెరుగవుతున్నాయని అన్నారు.
ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించామని, వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల మొండిబకాయిలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నియంత్రణను ఆర్‌బీఐ కిందకు తీసుకువస్తామని అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలను పటిష్ట పరుస్తామని, మెరుగైన పనితీరు కనబరిచే ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకింగ్, మ్యూచ్‌వల్ ఫండ్స్ నుంచి సహకారం అందేలా చూస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment