ఎగ్జిట్‌ పోల్‌ ప్రచురించిన పత్రికపై ఎఫ్‌ఐఆర్‌! | FIR against Dainik Jagran for publishing UP election exit poll | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్‌ ప్రచురించిన పత్రికపై ఎఫ్‌ఐఆర్‌!

Published Tue, Feb 14 2017 2:02 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

FIR against Dainik Jagran for publishing UP election exit poll

న్యూఢిల్లీ: తమ ఆదేశాలను ఉల్లంఘించి ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఎన్నికల ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను ప్రచురించిన హిందీ దినపత్రిక దైనిక్‌ జాగరణ్‌పై, 15 జిల్లాల్లోని దానికి సంబంధించిన ఏజెన్సీపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్  సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు సెక్షన్  126(ఏ) ప్రకారం రెండేళ్ల జైలు లేదా, జరిమానా లేదా రెండు శిక్షలు అమలయ్యేలా చూడాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్  లేఖ రాసింది. ఎగ్జిట్‌ పోల్‌ వార్త పొరపాటున ఇంగ్లిషు వైబ్‌సెట్‌లో వచ్చిందని, గుర్తించిన వెంటనే ఆ వార్తను తొలగించామని దైనిక్‌ జాగరణ్‌ వార్తాపత్రిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement