ఆదివారం సెంట్రల్ కోల్కతాలోని సిటీ మార్ట్ షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్ ద్వారా ఆర్పుతున్న దృశ్యం
వీకెండ్ షాపర్స్తో రద్దీగా ఉన్న సిటీ మార్ట్ షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన జనం బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే అగ్నికీలలు మాల్ అంతటా వ్యాపించాయి. అసలే భూకంపం ప్రభావంతో అల్లాడుతోన్న కోల్కతా నగరంలో ఆదివారం మద్యాహ్నం సమయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.
అయితే ప్రస్తుతానికి ఎవరైనా మరణించిన లేదా గాయపడిన వివరాలేవీ తెలియరాలేదు. మాల్ మూడో అంతస్తులో మొదలైన మంటలు.. అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయని, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం ఉండకపోవచ్చని , మొత్తం 25 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని కోల్కతా మేయర్ సోవన్ చటర్జీ చెప్పారు.