'రౌడీల చేతుల్లో ఎందుకు? నేనే చనిపోతా'
న్యూఢిల్లీ: తనకు చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నందున ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలంటూ ఓ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల అక్రమసంపాధనలు తెలుసుకునేందుకు బ్రిజిరాజ్ కిషన్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆర్టీఐ హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.
అయితే, అప్పటి నుంచి అతడిని హత్య చేశామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరో నేరస్తుల చేతుల్లో తన ప్రాణాలు పోవడం ఎందుకని, తనంతట తానే చనిపోయేందుకు అవకాశం ఇప్పించాలని కోరుతూ ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పటికే ఆయన పలు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు బయట పెట్టారు.