సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అంగీకరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన గురువారం పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు సురక్షితం కాదని,ఇది రిస్క్‌తో కూడుకున్నదని అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఇక ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కోరారు. మంత్రి లోక్‌సభలో మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సమూహాల్లో కలువరాదని సూచించారు. మరోవైపు కరోనాను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 కింద చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎపిడెమిక్ డిసీజెస్ చట్టం సెక్షన్ 2ను ప్రయోగించానలి అన్ని రాష్ట్రాలనూ కేంద్రం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment