
వైస్ చాన్స్‌లర్ కార్యాలయానికి నిప్పు పెట్టిన పూర్వవిద్యార్థి మోహన్
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో ఉన్న మహరాజ్ శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా(ఎంఎస్‌యూ) వైస్ చాన్స్‌లర్ కార్యాలయానికి ఓ పూర్వవిద్యార్థి నిప్పు పెట్టాడు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మోహన్ అనే యువకుడు 2007లో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి డిగ్రీ పట్టా ఇవ్వకుండా వర్సిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీసీ కార్యాలయంలోని సోఫాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రెండు గదులు, కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా మోహన్ వేసిన పెయింటింగ్స్ హిందూ దేవతలను కించపర్చేవిధంగా ఉన్నాయని, వాటిని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాడని విశ్వహిందూ పరిషత్ గతంలో ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment