VC office
-
వీసీ ఆఫీసుకు నిప్పు పెట్టిన తెలంగాణ విద్యార్థి
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో ఉన్న మహరాజ్ శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా(ఎంఎస్‌యూ) వైస్ చాన్స్‌లర్ కార్యాలయానికి ఓ పూర్వవిద్యార్థి నిప్పు పెట్టాడు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మోహన్ అనే యువకుడు 2007లో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి డిగ్రీ పట్టా ఇవ్వకుండా వర్సిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీసీ కార్యాలయంలోని సోఫాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రెండు గదులు, కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. డిగ్రీ ఫైనలియర్లో ఉండగా మోహన్ వేసిన పెయింటింగ్స్ హిందూ దేవతలను కించపర్చేవిధంగా ఉన్నాయని, వాటిని ఎగ్జిబిషన్లో ప్రదర్శించాడని విశ్వహిందూ పరిషత్ గతంలో ఆరోపించింది. -
హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. మంగళవారం వీసీ కార్యాలయం వద్ద హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావును తప్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు హెచ్‌యూసీ వీసీ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్‌సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.