హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన | Students agitations is continued to suspend HCU Vice chancellor at HCU VC office | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన

Published Tue, Jan 19 2016 10:31 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

Students agitations is continued to suspend HCU Vice chancellor at HCU VC office

హైదరాబాద్‌: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. మంగళవారం వీసీ కార్యాలయం వద్ద హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావును తప్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు హెచ్‌యూసీ వీసీ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement