మాజీ సీఎం కన్నుమూత | former MP CM sunder lal patwa passes away | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కన్నుమూత

Published Wed, Dec 28 2016 10:39 AM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

మాజీ సీఎం కన్నుమూత - Sakshi

మాజీ సీఎం కన్నుమూత

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్‌ పట్వా(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం గుండెపోటుతో మృతి చెందారు.

పట్వా మధ్యప్రదేశ్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి జనతాపార్టీ నుంచి 1980 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజులకన్నా తక్కువకాలం సీఎంగా పనిచేసిన ఆయన.. రెండోసారి భారతీయ జనతాపార్టీ నుంచి 1990 మార్చి 5 నుంచి 1992 డిసెంబర్‌ 15 వరకు సీఎంగా సేవలందించారు. పట్వా తన రాజకీయ ప్రస్థానాన్ని జనసంఘ్‌తో ప్రారంభించారు. అనంతరం 1977లో జనసంఘ్‌.. జనతా పార్టీలో విలీనమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement