ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయ శాఖా మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు, మాజీ ఎంపీ కృతివర్ధన్ సింగ్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం పార్టీ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు. ముజఫర్ నగర్ జరిగిన అల్లర్లలో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే మంత్రులు, అధికారులు సైఫై ఉత్సవంలో జల్సాలు చేశారని సింగ్ ఆరోపించారు.
ప్రజల కష్టాలను పట్టించుకోలేని ఈ ప్రభుత్వం, పార్టీలో కొనసాగడంలో అర్ధం లేదని, అందుకే తాము రాజీనామా చేశామన్నారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు పంపారు.