
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ విస్తరణలో కీలకంగా వ్యవహరించిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలు మమతకు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని ఆయన బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై విమర్శలుచేశారు. బీజేపీ మద్దతు లేకుండా తృణమూల్ ఈ స్థాయిలో ఎదిగి ఉండేది కాదన్నారు. ‘బీజేపీ మతతత్వ పార్టీ కాదు. అసలు సిసలు లౌకిక పార్టీ.
పశ్చిమబెంగాల్ ప్రజలు మమత పాలనతో సంతృప్తికరంగా లేరు. అందుకే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. త్వరలోనే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది’ అని రాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల నాయకత్వంలో పనిచేయటానికి గర్వపడుతున్నానన్నారు. సీపీఎం ప్రభుత్వ అత్యాచారాలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాన్ని కూడా నడిపిన రాయ్.. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం ఏర్పాటు కావటంలో విశేష కృషిచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశంసించారు. షరతులేమీ లేకుండానే బీజేపీలో చేరేందుకు రాయ్ ముందుకొచ్చారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment