శివమొగ్గ: కర్ణాటకలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణంలో ఓ హైస్కూలు విద్యార్థిని(14)ని గత నెల 29న ముగ్గురు మృగాళ్లు కారులో బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఉడుపి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. కాగా, విద్యార్థుల భద్రత, రక్షణ కోసం నిబంధనలను పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.