కదులుతున్న కారులో అఘాయిత్యం | Girl abducted from Noida Golf Course metro station, gangraped in moving car | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో అఘాయిత్యం

Published Sat, Sep 23 2017 2:57 PM | Last Updated on Sat, Sep 23 2017 3:16 PM

Girl abducted from Noida Golf Course metro station, gangraped in moving car

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో  మరో  దారుణం జరిగింది. ఒక మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి కదులుతున్న కారులో  సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 

సిటీ ఎస్‌పీ అరుణ్‌ కుమార్‌  సింగ్‌ అందించిన సమాచారం ప్రకారం నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ నుంచి ఒక మహిళను   కొందరు  దుండగులు కిడ్నాప్‌ చేశారు. స్కారియో వాహనంలోకి బలవంతంగా  ఒక వ్యక్తి అపహరించుకు వెళ్లాడు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం అఘాయిత్యానికి పాల్పడి అక్షరధామం మెట్రో స్టేషన్‌వద్ద  వదిలి వెళ్లిపోయారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు  మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement