సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ 59 చైనీస్ యాప్ కంపెనీలకు శుక్రవారం నోటీసులతో పాటు 79 ప్రశ్నలను పంపించింది. జూలై 22వ తేదీ లోపు ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పకపోతే ఈ కంపెనీలపై శాశ్వతంగా నిషేధించే అవకాశాలు ఉన్నాయి. (నిషేధిత 59 చైనీస్ యాప్స్ అవుట్ )
ఈ యాప్స్ పనితీరుపై ఇండియన్ ఇంటెలిజన్స్ ఏజన్సీలు, గ్లోబల్ సైబర్ వాచ్ డాగ్‌లు కూడా భారతప్రభుత్వానికి రిపోర్టులను అందించనున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఇచ్చే సమాచారం ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి. అందుకు భిన్నంగా ఏం జరిగిన ఈ కంపెనీలు భారీ నష్టాన్ని భరించకతప్పవని కొంత మంది ఉన్నతాధికారులు తెలిపారు. ఈ 79 ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వానికి సరైన వివరణ ఇవ్వగలిగితే మళ్లీ ఈ యాప్‌లు ఇండియాలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఇచ్చే సమాధానాలు ఒక కమిటీకి పంపిస్తారు. వారు వీటిని పరిశీలించి ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన రిపోర్టులను అందజేస్తారు. ఈ సంస్థలకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, డేటా మేనేజ్‌మెంట్, సర్వర్ల గురించి, వారి మాతృసంస్థలకు సంబంధించిన వివరాలు, అవి ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయిలాంటి పలు రకాలైన ప్రశ్నలు వాటిలో ఉన్నాయి. (టిక్‌టాక్ బ్యాన్: చైనాకు ఎంత నష్టమో తెలుసా?)
నిషేధిత చైనా యాప్ కంపెనీలకు 79 ప్రశ్నలు
Published Fri, Jul 10 2020 5:56 PM | Last Updated on Fri, Jul 10 2020 7:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment