కృష్ణ భక్తుల వినూత్న నిరసన
ముంబై: ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కృష్ణభక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వినూత్న ప్రదర్శనతో తమ అసంతృప్తిని వెల్లడించారు. ముంబైలోని దాదర్ ప్రాంతంలో కృష్ణభక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశామని అమర్ అనే భక్తుడు వెల్లడించాడు.
కాగా, ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎత్తు పెంచాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ అంతకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. మహారాష్ట్రలో కృష్ణాష్టమి సందర్భంగా ‘దహి హండి’ పేరుతో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే దీని కోసం ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించవద్దని, 18 సంవత్సరాల లోపువారు ఈ ఉత్సవంలో పాల్గొనవద్దని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.