బెంగళూరు నుంచి షార్‌కు వెళుతున్న జీశాట్ 6ఏ ఉపగ్రహం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 08 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్న జీశాట్ 6ఏ ఉపగ్రహం గురువారం షార్‌కు చేరుకుంది.
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం (ఐశాక్) నుంచి అత్యంత భారీ భద్రత నడుమ ఈ ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాన్ని భద్రపరిచి శుక్రవారం నుంచి పలు పరీక్షలు చేపట్టనున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన రాకెట్ అనుసంధాన భవనంలో మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేశారు. గత నెల 20న ఈ ప్రయోగం చేపట్టాలనుకున్నప్పటికీ ఉపగ్రహం షార్‌కు రావడంలో జాప్యం కావడంతో ఈ నెల 29కి వాయిదా వేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment