Satish Dhawan Space Center
-
‘సెంచరీ’కి షార్ సిద్ధం
సూళ్లూరుపేట/తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు ప్రతిష్టాత్మక వందో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ప్రయోగానికి మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించింది. జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.మిగిలిన 89 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బుధవారం నాటి ప్రయోగంతో సెంచరీ మైలురాయిని దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. 50.9 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ భూమి నుంచి నింగికి ఎగసే సమయంలో 420.7 టన్నులు బరువు కలిగి ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 19.17 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని 170 కిలో మీటర్లు పెరిజీ(భూమికి అతి దగ్గరగా), 36,577 కిలో మీటర్లు అపోజి(భూమికి దూరంగా) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు తమ ఆ«దీనంలోకి తీసుకుని, ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే పనిని పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు.జీఎస్ఎల్వీ–ఎఫ్15 నమూనాకు ప్రత్యేక పూజలుఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ–ఎఫ్15 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని చేరుకోవడానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్‌ను రోదసిలోకి పంపనున్నామని చెప్పారు.2025లో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇప్పటికి 6 జనరేషన్ల రాకెట్లను విజయవంతంగా వినియోగించామని వివరించారు. మొత్తం 433 విదేశీ శాటిలైట్లను గగనతలంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టామన్నారు. నెక్ట్స్ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో 30 వేల కేజీల సామర్థ్యం కలిగి 1,000 టన్నుల బరువు ఉన్న లాంచింగ్ వెహికల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీహరికోటలో రూ.4,000 కోట్లతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నామని, నాలుగు నెలల్లో ఇది పూర్తవుతుందని వి.నారాయణన్ వెల్లడించారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
హెచ్ఎంటీ నుంచి ఇస్రోకు భారీ యంత్రం
హైదరాబాద్: హిందూస్థాన్ మెషీన్ టూల్స్ అరుదైన ఘనతను సాధించింది. దేశీయంగా ఇంతవరకు తయారు చేయని అతిపెద్ద యంత్రాన్ని తయారు చేసి ఇస్రోకు అందించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కోసం సాలిడ్ రాకెట్ మోటార్స్ త్రీ యాక్సెస్ మెషినరీని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్‌కు హెచ్ఎంటీ (హైదరాబాద్) సంస్థ అందజేసింది. హై ఫ్రీక్వెన్సీ, ప్రెజరైజ్డ్ కంట్రోల్ రూమ్, చిప్ అండ్ డస్ట్ కలెక్షన్ వంటివి మెషీన్ ప్రత్యేకతలు. 200 టన్నుల లోడ్ సామర్థ్యం, 12.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ యంత్రం హెచ్ఎంటీ నిర్మించిన యంత్రాల్లో అతిపెద్దది. ఇది ఇస్రో సాలిడ్ రాకెట్ మోటార్ల ఉత్పత్తిని పెంచడానికి ఉపకరిస్తుందని, దీన్ని రూపొందించడానికి రూ.18 కోట్లు వెచ్చించినట్లు హెచ్ఎంటీ హైదరాబాద్ యూనిట్ జనరల్ టెక్నికల్ మేనేజర్ బీవీఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంటీ సేల్స్ డీజీఎం నరేశ్, డిజైన్స్ డీజీఎం రాజబాబు, ప్రొడక్షన్ డీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇస్రో నుంచి భారీ ప్రయోగాలు!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇప్పటికే ఎన్నో విజయవంతమైన రాకెట్ ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.628.95 కోట్ల వ్యయంతో రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (ఎస్వీఏబీ)ని నిర్మించారు. దీని ద్వారా రెండు రాకెట్లను అనుసంధానం చేయొచ్చు. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (ఎస్వీఏబీ)లో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లు, సుమారు ఐదు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్–2 లాంటి భారీ ప్రయోగాలకు కూడా ఎస్వీఏబీ వేదిక కానుంది. ఏటా నాలుగు జీఎస్ఎల్వీ, 12 పీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. 96 మీటర్లు ఎత్తు కలిగిన ఎస్‌వీఏబీలో అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండేలా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ప్లాట్‌పామ్‌లకు రూ.70 కోట్లు, డోర్లకు రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్ (టాక్టర్)కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికి కలిపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రస్తుతం పెరిగిన మెటీరియల్ కాస్ట్‌తో మరో వంద కోట్లు దాకా బడ్జెట్ పెరిగింది. వ్యోమగాములను పంపడానికి ఏర్పాట్లు షార్‌లో రూ.245 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ కేంద్రాన్ని నిర్మించి గతేడాది ప్రారంభించారు. ఒకేసారి పది రాకెట్లను ట్రాకింగ్ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచంలో ఎంఓటీఆర్ ఉన్న రెండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఘన ఇంధనం తయారీకి అవసరమైన వాటిని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించారు. మరో ఏడాదిన్నరలో వీటిని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా ప్రయోగించి విజయం సాధించడంతో షార్‌లోనే స్పేస్ షటిల్‌కు కావాల్సిన రన్‌వేను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో ఇక్కడి నుంచే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్ ప్రపంచ స్థాయి రాకెట్ ప్రయోగ కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. -
పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగానికి కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12న వేకువజామున 4.04 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకకు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ41 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 43వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
29న నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 08
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ ఎఫ్ 08 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్న జీశాట్ 6ఏ ఉపగ్రహం గురువారం షార్కు చేరుకుంది. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం (ఐశాక్) నుంచి అత్యంత భారీ భద్రత నడుమ ఈ ఉపగ్రహం షార్కు చేరుకుంది. షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాన్ని భద్రపరిచి శుక్రవారం నుంచి పలు పరీక్షలు చేపట్టనున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన రాకెట్ అనుసంధాన భవనంలో మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేశారు. గత నెల 20న ఈ ప్రయోగం చేపట్టాలనుకున్నప్పటికీ ఉపగ్రహం షార్కు రావడంలో జాప్యం కావడంతో ఈ నెల 29కి వాయిదా వేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ–39కి కౌంట్‌డౌన్ ప్రారంభం
-
పీఎస్ఎల్వీ సీ–39కి నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం నిర్వహించిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్ కేంద్రంలోని బ్రహ్మ ప్రకాశ్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేశ్ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం 6.59 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించారు. కానీ అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రయోగ సమయాన్ని మరో నిమిషం పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నానికి రాకెట్‌కు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి 29 గంటల ముందు అంటే.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ సీ–39 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించనున్నారు. -
23న పీఎస్ఎల్వీ సీ–38 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న పీఎస్ఎల్వీ సీ–38 రాకెట్ ద్వారా 34 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్ మొదటి ప్రయోగ వేదికపై శుక్రవారం రాకెట్ శిఖర భాగాన ఉపగ్ర హాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహం, పలు దేశాలకు చెందిన 33 చిన్న ఉపగ్రహాలను పంపనున్నా రు. 23న ఉదయం 9.29 గంటలకు ప్రయోగాన్ని చేపట్టే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ అనుసంధాన పనులను ఈ నెల 28న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఐఆర్ఎన్ ఎస్ఎస్ సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో ఒకటి సాంకేతిక లోపం వల్ల పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో ఉపగ్రహాన్ని జూలైలో చేపట్టే పీఎస్ఎల్వీ సీ39లో పంపేందుకు సిద్ధమవుతున్నారు. -
షార్‌లో అప్రమత్తత
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశానికే తలమానికమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో కూడా అప్రమత్తత ప్రకటించారు. షార్కు నిత్యం పహారా కాస్తున్న కేంద్ర ప్రాథమిక భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సుభాష్ సిన్హా తెలిపారు. హైఅలర్ట్‌తో సిబ్బంది నిత్యం మరో మూడు గంటలపాటు అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. షార్ ఐల్యాండ్‌కు దక్షిణాన పల్వేరికాడ్ వైపు, ఉత్తరాన రాయదొరువు వైపు, సముద్రతీరప్రాంతం వైపు ప్రత్యేకంగా సాయుధ దళాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి భద్రతా సిబ్బందితో నాలుగు మొబైల్ పార్టీలను గస్తీ ఏర్పాటు చేశారు. బకింగ్‌హాం కెనాల్, అటకానితిప్ప, షార్ పరిసర ప్రాంతాల్లోనూ గస్తీని ముమ్మరం చేశారు. పులికాట్ సరస్సులో, బంగాళాఖాతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని జాలర్లకు ఆదేశాలిచ్చారు. షార్‌లోకి అపరిచిత వ్యక్తులు చొచ్చుకు రాకుండా చూసేందుకు కూడా సరిహద్దుల్లో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. షార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
INSET - 3DR
ఇస్రో సెప్టెంబర్ 8న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్ణీత కౌంట్‌డౌన్‌కు 40 నిమిషాలు ఆలస్యంగా జీఎస్ఎల్వీ-ఎఫ్05 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆ రోజు సాయంత్రం 4.10 గంటలకు రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉండగా, చివర్లో క్రయోజెనిక్ ఇంజన్లో ఏర్పడిన సమస్యను గుర్తించి, సరిచేసి సాయంత్రం గం.4.50కి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ కలిగిన జీఎస్ఎల్వీ మార్క-2 నౌకను ఉపయోగించారు. జీఎస్ఎల్వీ భూ స్థిర, భూ అనువర్తిత కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో ఇస్రో 1990లో జీఎస్ఎల్వీ (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 3 దశల అంతరిక్ష నౌక. ఇందులో మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. మూడో దశ క్రయోజెనిక్ దశ. ఈ దశలో -2530ఇ వద్ద ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్‌ను -1960ఇ వద్ద ఆక్సిడైజర్‌గా ఉపయోగిస్తారు. అమెరికా ఒత్తిడితో 1990ల్లో భారత్‌కు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ బదిలీని రష్యా నిలిపేసింది. దీంతో ఇస్రో 1996లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇస్రో 2010, ఏప్రిల్ 15న జీఎస్ఎల్వీ-డీ3లో తొలిసారి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్లో జీఎస్ఎల్వీ-ఎఫ్06 ద్వారా చేపట్టిన విదేశీ క్రయోజెనిక్ ఇంజన్ ప్రయోగం కూడా విజయవంతం కాలేదు. ఈ వరుస వైఫల్యాలకు కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం, ఇస్రో 2013 ఆగస్టులో స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ ఉన్న జీఎస్ఎల్వీ-డీ5ను ప్రయోగించదలచింది. ఈ ప్రయోగానికి 75 నిమిషాల ముందు రెండో దశలో ఆక్సిడైజర్ ట్యాంకులో లీకేజీని గుర్తించారు. దాంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు. చివరకు ఇస్రో 2014, జనవరి 5న జీఎస్ఎల్వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించింది. తర్వాత 2015, ఆగస్టు 27న కూడా దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ ఉన్న జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తాజా ప్రయోగంతో క్రయోజెనిక్ ఇంజన్, జీఎస్ఎల్వీ ప్రయోగాల పరంగా భారత్ హ్యాట్రిక్ సాధించింది. 1990లో జీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఇస్రో.. 2001, ఏప్రిల్ 18న మొదటి జీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగాన్ని (జీఎస్ఎల్వీ-డీ1) విజయవంతంగా నిర్వహించింది. జీఎస్ఎల్వీ- ఎఫ్05తో కలిపి ఇప్పటివరకు పది జీఎస్ఎల్వీ ప్రయోగాలు నిర్వహించగా, వాటిలో ఏడు విజయవంతమయ్యాయి. ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. ఇస్రో దీన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్05 ద్వారా 170 కి.మీ పెరీజీ, 35,975 కి.మీ. అపోజీ ఉన్న భూస్థిర కక్ష్యలోకి ప్రయోగించింది. దీని బరువు 2211 కిలోలు. దీనిలో మొత్తం నాలుగు పేలోడ్లు ఉన్నాయి. అవి.. 1. మల్టీ స్పెక్ట్రల్ ఇమేజర్ ఇది భూ స్థిర కక్ష్య నుంచి ప్రతి 26 నిమిషాలకు ఒకసారి కీలక చిత్రాలను భూమికి పంపిస్తుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, పర్వతాలపై మంచు, హిమ నిర్మాణం, మేఘాల కదలికలు, గాలుల వేగం మొదలైన వాటి గురించి కీలక సమాచారం అందిస్తుంది. 2. సౌండర్ ఇది 19 చానెల్ సౌండర్, 19 రకాల తరంగ దైర్ఘ్యాల్లో చిత్రీకరణ ద్వారా ఉష్ణోగ్రత, ఆర్ర ్దత సమాచారాన్ని అందిస్తుంది. ఓజోన్ పొరను నిరంతరం అధ్యయనం చేస్తుంది. 3. డేటా రిలే ట్రాన్స్‌పాండర్ మానవ రహిత ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఉద్దేశించింది. 4. సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్‌పాండర్ ఓడలు, విమానాలు వంటివి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటి నుంచి వెలువడే ప్రమాద సంకేతాలను గ్రహించి తక్షణ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ఇండియన్ మిషన్ కంట్రోల్ సెంటర్ వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉపగ్రహంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్స్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణ దళాలు, జాలర్లు ఎక్కువగా లబ్ధిపొందుతారు. ఇది అందించే వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ విభాగం వద్ద ఏర్పాటుచేసిన ఇన్శాట్ మెటీరియోలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ (ఐఎండీపీఎస్) సహాయంతో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంతోపాటు భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, షీషెల్స్, శ్రీలంక, టాంజానియా దేశాలకు ఇన్శాట్-3డీఆర్ ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇన్శాట్-3డీఆర్ ప్రత్యేకతలు మధ్య తరంగ దైర్ఘ్య పరారుణ కాంతిలో రాత్రి సమయంలో మేఘాలు, మంచులో స్పష్టంగా చిత్రీకరణ థర్మల్ పరారుణ బ్యాండ్లలో అధిక కచ్చితత్వంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనా. దృగ్గోచర, థర్మల్ పరారుణ బ్యాండ్లలో అధిక రిజల్యూషన్‌తో చిత్రీకరణ. సి.హరికృష్ణ సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
ఒకేసారి 20 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ రాకెట్‌తో కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర - విజయవంతంగా20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో - పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్‌తో 26 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి - భారత్‌కు చెందిన మూడు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు - కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూమి వినియోగం, నీటి పంపిణీ తదితర రంగాల్లో సేవలు - రాష్ట్రపతి, ప్రధాని, సోనియా తదితర ప్రముఖుల అభినందనలు శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను బుధవారం విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం) ఇందుకు వేదికయింది. షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఉదయం 9:26 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ34) ఉపగ్రహ వాహక నౌక ద్వారా.. 17 విదేశీ ఉపగ్రహాలతో సహా మొత్తం 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కేవలం 26 నిమిషాల వ్యవధిలోనే కొత్త తరం భూ పరిశీలన ఉపగ్రహం (కార్టోశాట్-2 శ్రేణి)తో పాటు మరో 19 ఉపగ్రహాలను నిర్దేశిత సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒక కేజీ బరువున్న ఉపగ్రహాల నుంచి 700 కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. మొత్తం 20 ఉపగ్రహాల బరువు దాదాపు 1,288 కిలోలు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రయోగంతో వేల కోట్ల అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో భారత్ కీలక దేశంగా అవతరించింది. ఇస్రో ప్రయోగించిన 20 ఉపగ్రహాల్లో 13 అమెరికాకు చెందినవి కావటం విశేషం. అందులోనూ 12 ఉపగ్రహాలు భూమిని చిత్రీకరించే డవ్ శాటిలైట్లు. ఒక్కొక్కటి 4.7 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలు ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థకు చెందినవి. మరొకటి గూగుల్ యాజమాన్యంలోని ఒక సంస్థకు చెందిన స్కైశాట్ జెన్-2 ఉపగ్రహం. దాని బరువు 110 కిలోలు. ఇవిగాక.. కెనడాకు చెందిన రెండు ఉపగ్రహాలు, జర్మనీ, ఇండోనేసియా దేశాల నుంచి ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహం బరువు 727.5 కిలోలు. ఇది సాధారణ రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది. ఇందులో వ్యూహాత్మక అప్లికేషన్లు కూడా ఉన్నాయి. పట్టణ, గ్రామీణ అప్లికేషన్లు, తీర భూమి వినియోగం, నియంత్రణ, రోడ్ల వ్యవస్థ పర్యవేక్షణ, నీటి పంపిణీ వంటి వినియోగ నిర్వహణ తదితరాలకు కూడా దీనిని వినియోగిస్తారు. భూ వినియోగ మ్యాపుల రూపకల్పన, కచ్చితమైన అధ్యయనం, భౌగోళిక, మానవ కల్పిత లక్షణాల మార్పును గుర్తించటం, వివిధ ఇతర భూ సమాచార వ్యవస్థ, భౌగోళిక సమాచార వ్యవస్థ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ప్రయోగించిన.. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి చెందిన సత్యభామశాట్, పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన స్వయం ఉపగ్రహం భారతదేశానికి చెందినవి. కిలో కన్నా తక్కువ బరువున్న స్వయం ఉపగ్రహాన్ని ఈ కాలేజీ విద్యార్థులు 170 మంది కలిసి రూపొందించారు. మారుమూల ప్రదేశాల్లోనూ సమాచార సంబంధాల కోసం ఉద్దేశించినది. ఇంతకుముందు ఇస్రో 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పటివరకూ ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన రికార్డు రష్యాకు చెందుతుంది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. అమెరికాకు చెందిన నాసా అత్యధికంగా ఒకేసారి 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కొత్త మైలురాళ్లు దాటుతోంది ఈ ప్రయోగం విజయవంతమవటం పట్ల ఇస్రోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యం పెరుగుతోందని ప్రణబ్ అన్నారు. మోదీ స్పందిస్తూ.. ‘ఒకేసారి 20 ఉపగ్రహాలు. కొత్త మైలురాళ్లను అధిగమించటాన్ని ఇస్రో కొనసాగిస్తోంది. మనం అంతరిక్ష కార్యక్రమాల్లో ఇతర దేశాలకు సహాయపడే నైపుణ్యతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం’ అని ట్వీట్ చేశారు. ఇస్రోను కేంద్ర కేబినెట్ కూడా అభినందించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ అభినందనలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయ పూర్వకంగా అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ ప్రపంచంలోని బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే అగ్ర దేశాల సరసన నిలిచిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగ క్రమం ఇలా.. ► ఉదయం 9.25కు ప్రయోగం ప్రారంభం ► ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనంతో 108 సెకన్లకు మొదటిదశ పూర్తి ► 42 టన్నుల ద్రవ ఇంధనంతో 260 సెకన్లకు రెండో దశ పూర్తి ►7.6 టన్నుల ఘన ఇంధనంతో 491 సెకన్లకు మూడో దశ ► 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 987 సెకన్లకు నాలుగో దశ ► ముందుగా ఇస్రో కార్టోశాట్-2ను 17.07 నిమిషాలకు భూమికి 508 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశం ►17.42 నిమిషాలకు చెన్నై, పుణేలోని వర్సిటీ విద్యార్థుల సత్యభామశాట్, స్వయంశాట్ ఉపగ్రహాలు కక్ష్యలోకి.. ►18.23 నిమిషాలకు ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్ ఉపగ్రహాలు కక్ష్యలోకి ►19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3 ఎంశాట్, యూఎస్ఏ గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్జెన్లు కక్ష్యలోకి.. ►19.22 నిమిషాలకు కెనడా జీహెచ్‌బీశాట్ ► 26.20 నిమిషాలకు యూఎస్ఏకు చెందిన 12 డవ్ శాటిలైట్స్.. ►మొత్తం 26.30 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్ ►ప్రయోగం తర్వాత భవిష్యత్ పరీక్షల కోసం ప్రయోగాత్మకంగా 4వ దశలోని ఇంజిన్లను మండించి మరో ఆరు నిమిషాల పాటు పీఎస్-4ను పరీక్షించి విజయం సాధించారు. వ్యయం తగ్గిస్తాం: ఇస్రో చైర్మన్ ‘‘ఒకే పేలోడ్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించటం.. పక్షులను గాలిలోకి ఎగురవేయటం వంటిది’’ అని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఏడాదికి 12-18కి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పరిశ్రమలు - ఇస్రో భాగస్వామ్యంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో వ్యయాన్ని తగ్గించే దిశగా తమ కృషి కొనసాగుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోగా సౌత్ ఈస్ట్ ఏసియన్ ఉపగ్రహాన్ని (గతంలో సార్క్ ఉపగ్రహం) ప్రయోగించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు. తాజా ప్రయోగంలో సూర్యానువర్తన కక్ష్యలోకి వివిధ రకాల ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు నాలుగోదశ (పీఎస్-04)లో ఆరు నిమిషాల పాటు చేసిన ప్రయోగాత్మక పరీక్షలో సఫలమయ్యామన్నారు. కాగా, పీఎస్ఎల్వీ 35వ వరుస విజయవంతమైన కార్యక్రమాల్లో తాజా ప్రయోగం భారీ విజయమని షార్ డెరైక్టర్ పి.కున్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇస్రోకు, భారత్‌కు పీఎస్ఎల్వీ ఒక చిహ్నంగా నిలిచిందని అభివర్ణించారు. ఈ విజయం ఒక ప్రధాన మైలురాయి అని మిషన్ డెరైక్టర్ డి. జయకుమార్ చెప్పారు. కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహం ద్వారా గ్రామీణ, పట్టణాభివృద్ధి, సమాచార వ్యవస్థ, కొత్త ప్రాంతాల్లో నిర్దిష్ట వ్యవసాయం వంటి పలు రంగాల్లో సామర్థ్యం పెరుగుతుందని ఆ ప్రాజెక్ట్ డెరైక్టర్ సత్యానంద్ రావు తెలిపారు. -
నెల్లూరు షార్ లో అగంతకుడు
శ్రీహరి కోట రాకెట్ కేంద్రంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎస్.కరణ్(33) అనే వ్యక్తిని షార్ భద్రతా సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అనంతరం శ్రీహరి కోట పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నవగార్ తాలుకా పరిధిలోని మొహిత్రి గ్రామానికి చెందిన కరణ్ దక్షిణం వైపు కేటీఎన్ గేట్ వద్ద తిరుగుతుండగా.. భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రశ్నించగా.. తాను సముద్రం అంచునే నడిచి వచ్చానని తెలిపాడు. అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అప్పగించారు. -
పీఎస్ఎల్వీ-సీ27 ప్రయోగం విజయవంతం
-
షార్ డైరెక్టర్‌కు ‘సారాభాయ్’ అవార్డు
-
షార్ డైరెక్టర్‌కు ‘సారాభాయ్’ అవార్డు
సూళ్లూరుపేట: ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్మారక అవార్డుకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు ఇస్రో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో 2014-15 సంవత్సరానికిగాను షార్ డెరైక్టర్ ప్రసాద్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. త్వరలో జరగబోయే కార్యక్రమంలో ప్రసాద్‌కు పసిడి పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నట్టు సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్బీ నిమ్సే పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును ఇస్రో చైర్మన్లు ప్రొఫెసర్ సతీష్ ధవన్, డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్ రాధాకృష్ణన్‌తో పాటు డీఆర్డీవో శాస్త్రవేత్త వీకే సారస్వత్ అందుకున్నారు. దేశానికి ఎన్నో సేవలందించిన ప్రసాద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలు, షార్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి పీఎస్ఎల్వీ -సి 23 కౌంట్ డౌన్
శ్రీహరికోట: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 49 గంటల అనంతరం రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 9.49 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 23 ప్రయోగం జరుగనుంది. పీఎస్ఎల్వీ సీ-23 అయిదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్కు రానున్నారు. ఇందుకోసం నరేంద్ర మోడీ 29న చెన్నైకి చేరుకుంటారు. అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకొని.. రాత్రి ప్రత్యేక అతిథిగృహంలోబసచేస్తారు. ఉదయం ప్రయోగాన్ని తిలకించి, 11 గంటలకు తిరిగి చెన్నై వెళ్లి.. అటు నుంచి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా పోలీసులతోపాటు మెరిన్ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రత బలగాలు (సీఐఎస్ఎఫ్) పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. -
పీఎస్ఎల్వీ సీ-23 కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగానికి శనివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 49 గంటల అనంతరం రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. 30వ తేదీ ఉదయం 9.49 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 23 ప్రయోగం జరుగనుంది. పీఎస్ఎల్వీ సీ-23 అయిదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్కు రానున్నారు. ఇందుకోసం నరేంద్ర మోడీ 29న చెన్నైకి చేరుకుంటారు. అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకొని.. రాత్రి ప్రత్యేక అతిథిగృహంలోబసచేస్తారు. ఉదయం ప్రయోగాన్ని తిలకించి, 11 గంటలకు తిరిగి చెన్నై వెళ్లి.. అటు నుంచి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా పోలీసులతోపాటు మెరిన్ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రత బలగాలు (సీఐఎస్ఎఫ్) పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. -
నేడు షార్‌లో మిషన్ సంసిద్ధతా సమావేశం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగించబోయే పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ, లాంఛ్ ఆథరైజేషన్ బోర్డు సంయుక్తంగా మిషన్ సింసిద్ధతా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పరిశీలించి 28న ఉదయం 8.49 గంటలకు కౌంట్‌డౌన్, 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేం దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. మిషన్ సంసిద్ధతా సమావేశం అనంతరం ప్రయోగానికి సంబంధించి లాంఛ్ రిహార్సల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేసి గురువారం షార్ కేంద్రంలో అంతా సిద్ధంగా వుందని తెలిపేందుకు ఓవరాల్ రెడీనెస్ రివ్యూ (ఓఆర్ఆర్) నిర్వహించి అన్ని పరీక్షలు పూర్తి చేసి రాకెట్‌ను ఎంఆర్ఆర్ కమిటీకి అప్పగించారు. 28న రుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో, 29న చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ కే రాధాకృష్ణన్పూజలు చేస్తారు. -
పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగం అనుమానమే!
సూళ్లూరుపేట: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-23ని ఈ నెల 26న ప్రయోగించాలని నిర్ణయించినా ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ఈ తేదీ మారే అవకాశం ఉంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు మోడీ వచ్చే తేదీలను అనుసరించి ప్రయోగ తేదీ ఖరారు కావచ్చని తెలిసింది. పీఎస్ఎల్వీ సీ-23కి సంబంధించి నాలుగు దశల అనుసంధానం పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ నెల 16 వరకు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేసి, ప్రయోగ తేదీని ఖరారు చేస్తారు. కాగా, ప్రధాని విచ్చేస్తారని షార్‌లో ఎలాంటి సమాచారమూ లేదు. -
షార్‌లోని పీఈఎల్ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం
రూ.1.25 కోట్ల మేరకు నష్టం సూళ్లూరుపేట(నెల్లూరు), న్యూస్‌లైన్: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో గురువారం తెల్లవారుజాము స్ప్రాబ్ విభాగంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్(పీఈఎల్) అనే కాంట్రాక్టు సంస్థకు చెందిన స్టోర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ.1.25 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా. షార్ట్ సర్క్యూటై ప్రమాదం జరిగి ఉంటుందని షార్ వర్గాలు భావిస్తున్నాయి. స్టోర్స్‌లో వున్న విలువైన ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన స్టోర్స్‌కు కొద్దిదూరంలో వున్న క్యూరింగ్ కాస్టింగ్ ప్లాంటుకు, ఘన ఇంధన ప్లాంటుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ మంటలు షార్ అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా షార్‌లోని రెండో ప్రయోగవేదికపై జీఎస్ఎల్వీ డీ5 అనుసంధానం కార్యక్రమం జరుగుతుండటంతో అగ్రిప్రమాదంపై షార్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై విచారణ కోసం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీని వేశారు. కమిటీ ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని షార్ డెరైక్టర్ తెలిపారు. -
ఇస్రో ‘అరుణ’పతాక !
దశాబ్దాలుగా మానవుడి ఊహలతో దోబూచులాడుతున్న... మస్తిష్కానికి నిరంతరం పదునుబెడుతున్న అంగారకుడు మనకూ అందివచ్చినట్టే. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారకుడు లక్ష్యంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఎలాంటి అవరోధాలూ లేకుండా ప్రారంభించింది. సరిగ్గా అనుకున్న సమయానికే నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ)-సీ25 రాకెట్... మామ్‌ను జయప్రదంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. మరో నెల్లాళ్లకు మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. గత నెల 28నే నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేదని గుర్తించి మంగళవారానికి వాయిదావేశారు. ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 56.30 గంటలపాటు కొనసాగింది. ఈ సమయమంతా శాస్త్రవేత్తలు రాత్రింబగళ్లు కళ్లల్లో ఒత్తులువేసుకుని అన్ని వ్యవస్థలనూ ఒకటికి పదిసార్లు నిశితంగా పర్యవేక్షించారు. దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అరుణగ్ర హానికి ఇది 299 రోజుల్లో... అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్‌నాటికి చేరుతుంది. అటు తర్వాత మామ్‌లో ఉండే అయిదు ముఖ్యమైన పరికరాలు వెనువెంటనే పనులు ప్రారంభిస్తాయి. అంగారకుణ్ణి అన్ని కోణాల్లోనూ జల్లెడపడతాయి. అక్కడ ఒకప్పుడు జీవరాశి ఉండటానికి అనువైన పరిస్థితులుండేవా అన్న అంశాన్ని తేలుస్తాయి. అక్కడి వాతావరణంలో, గ్రహ ఉపరితలంలో ఉన్న పదార్ధాలేమిటో పట్టి చూపుతాయి. ప్రతి 780 రోజులకూ అరుణగ్రహం భూమికి అత్యంత చేరువగా వస్తుంది. ఈ చేరువయ్యే సమయం అక్టోబర్-నవంబర్ నెలల్లో వచ్చింది గనుక మామ్ ప్రయోగానికి ఇదే సరైన అదునుగా శాస్త్రవేత్తలు భావించారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. అరుణగ్రహమే లక్ష్యంగా ప్రపంచంలో ఇంతవరకూ సాగిన ప్రయోగాలూ... వాటి ఫలితాలూ చూస్తే మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలేమిటో అర్ధమవుతాయి. 1960లో అప్పటి సోవియెట్ యూనియన్ అరుణగ్రహాన్ని గురిచూసినప్పటినుంచి ఇంతవరకూ 51 ప్రయోగాలు సాగాయి. అందులో కేవలం 21 ప్రయోగాలు మాత్రమే ఫలించాయి. ఇన్ని ప్రయోగాలనూ చేయగలిగింది అమెరికా, రష్యా, యూరోప్‌కి చెందిన మూడు అంతరిక్ష సంస్థలు మాత్రమే. అంతేకాదు...ఈ సంస్థలన్నీ తొలుత తప్పటడులే వేశాయి. ఏ ఒక్కటీ తొలి ప్రయోగాన్ని విజయవంతం చేయలేకపోయాయి. రష్యాతో కలిసి చైనా రెండేళ్లక్రితం అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపడానికి ప్రయత్నించి విఫలమైంది. అది భూకక్ష్యను దాటి ముందుకెళ్లలేక కూలిపోయింది. జపాన్ ప్రయత్నాలూ సఫలం కాలేదు. కానీ, మన శాస్త్రవేత్తలు మాత్రం తొలి ప్రయోగంలోనే తామేమిటో ప్రపంచానికి నిరూపించారు. తమ సత్తా ఏపాటిదో చూపారు. పైగా ఇతర అంతరిక్ష సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యవధిలో, అతి తక్కువ వ్యయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంచేశారు. ఇస్రో ఇంతకాలం సాగించిన ప్రయోగాలు ఒక ఎత్తయితే...ఇప్పుడు పంపిన మామ్ ప్రయోగం మరో ఎత్తు. భూ కక్ష్యను దాటి గ్రహాంతరయానానికి ఒక ఉపగ్రహాన్ని సిద్ధంచేసి పంపడమంటే మాటలు కాదు. అదొక సంక్లిష్టమైన ప్రయోగం. చంద్రయాన్-1 ప్రాజెక్టులో వచ్చిన అనుభవాలతో, దానికి పొడిగింపుగా ఇస్రో ఇప్పుడు ఈ సంక్లిష్ట ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉపగ్రహానికి సంకేతాలు పంపడానికీ... దాన్నుంచి వచ్చే సమాచారాన్ని అందుకోవడానికీ మధ్య 40 నిమిషాల వ్యవధి పడుతుంది. అంటే, దాని గమనాన్ని నిరంతరం అత్యంత నిశితంగా పరిశీలించి, అంతే ఖచ్చితత్వంతో అంచనావేసుకుని తగినవిధంగా సంకేతాలు పంపాల్సి ఉంటుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా అది ముందుకెళ్తుంది. చీకటి ఆకాశంలో తళుకులీనే తారల్లో అంగారకుడిది విశిష్ట స్థానం. నిప్పుల బంతిలా నిత్యం జ్వలిస్తున్నట్టు ఎర్రై కనబడే ఈ గ్రహం ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు చిరునామాయే! ఇప్పటికే అక్కడ పాత్‌ఫైండర్, సోజోర్నర్, స్పిరిట్వంటి పరిశోధనా నౌకలు ఎన్నో పరిశోధనలు చేశాయి. ఛాయాచిత్రాలు పంపాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అంగారకుడిపై జీవాన్వేషణకోసమని అంతరిక్ష నౌక ‘క్యూరియాసిటీ’ని పంపింది. అది అక్కడి బిలంలో ఏడాదికాలంలో 1.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దాదాపు 40వేల ఛాయాచిత్రాలను పంపడంతోపాటు సంచార ప్రయోగశాలగా కూడా పనిచేసింది. రెండుచోట్ల అంగారకుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్‌చేసి అక్కడి మట్టిలో ఉన్న పదార్ధాలేమిటో విశ్లేషించి చూపింది. ఒకప్పుడు అక్కడున్న నీరు ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ కలసి లేదని, అది స్వచ్ఛమైనదేనని నిరూపించింది. అత్యంత వేగంతో నీరు పారినప్పుడు ఏర్పడే గులకరాళ్ల జాడనూ పట్టిచూపింది. ఇప్పుడు ఇస్రో పంపిన ‘మామ్’ ఈ జ్ఞానాన్ని మరింత విస్తరింపజేస్తుంది. అక్కడి వాతావరణంలో మీథేన్ వాయువు లేదని ఇంతవరకూ వెళ్లిన అంతరిక్ష నౌకలు తేల్చగా, మన ‘మామ్’ ఇంకాస్త లోతుగా దీన్ని పరిశోధిస్తుంది. అయితే, ఈ ప్రయోగాన్ని వాస్తవానికి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) ద్వారా ప్రయోగించాల్సి ఉంది. అయితే, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రోది విఫల చరిత్ర గనుక దాని జోలికిపోకుండా చంద్రయాన్‌ను విజయవంతంగా పరిపూర్తిచేసిన పీఎస్ఎల్వీనే ఆశ్రయించారు. ముందనుకున్నట్టు జీఎస్ఎల్వీ ద్వారా అయితే, ఇప్పుడు పంపినట్టు 5 పరికరాలతో సరిపెట్టకుండా 12 పరికరాలను పంపడం వీలయ్యేది. పరిశోధనల విస్తృతి మరింత పెరిగేది. అంతేకాక అంగారకుడికి ఇంకాస్త చేరువగా వెళ్లడం సాధ్యమయ్యేది. ఏమైనా ఎన్నో ప్రతికూలతలను అధిగమించి అతి తక్కువ వ్యవధిలో ఇంతటి విజయాన్ని సాధించి అగ్రరాజ్యాల సరసన మన దేశాన్ని నిలబెట్టిన శాస్త్రవేత్తల పట్టుదలకున జాతి మొత్తం జేజేలు పలుకుతుంది. -
పీఎస్ఎల్వీ సీ25 కౌంట్‌డౌన్ రేపు ప్రారంభం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌకకు ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. ఈ ప్రయోగం ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి పంపనుండటం తెలిసిందే. శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎం.ఆర్.ఆర్.) చైర్మన్ కాటూరి నారాయణ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. అనంతరం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ల్యాబ్ సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారమే ప్రయోగాన్ని చేయాలని నిర్ణయించారు. ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్‌ను శుక్రవారం మరోసారి నిర్వహించినట్టు తెలిసింది. -
షార్కు తగిలిన షాక్
సాక్షి నెట్వర్క్ : విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నిరవధిక సమ్మె కారణంగా ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మంగళవారం రోజూ సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. రాత్రి సమయంలో అక్కడక్కడా విద్యుత్‌ను పునరుద్ధరించినా ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ సరఫరా క్రమంగా షట్‌డౌన్ అయింది. దేశానికే తలమానికమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు సమైక్య ఉద్యమ సెగ తాకింది. విద్యుత్ ఉద్యోగులు మంగళవారం సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్నం 1.20కి మన్నూరు పోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షార్, రైల్వే, పారిశ్రామికవాడకు వెళ్లే లైన్లు ట్రిప్ అయ్యాయి. షార్ కేంద్రంలో ఈ నెల 28న అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం మార్స్‌మిషన్ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పనికి తీవ్ర ఆటంకం కలిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఉత్పాదన అందిస్తున్న విజయవాడలోని ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు నిలిచిపోవడంతో సదరన్ పవర్ గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖలోని కేజీహెచ్, రిమ్స్, కాకినాడ జీజీహెచ్ తదితర ప్రధాన ఆస్పత్రులు, నీటి సరఫరా కేంద్రాలకు అత్యవసర కేటగిరీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో 240 మెగావాట్లు, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌లో 57మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా లోయర్ సీలేరు ఏపీజెన్కో ప్రాజెక్టు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికీ సమైక్య సెగ తగిలింది. ఉద్యోగుల సమ్మెతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెలంగాణకు చెందిన డొంకరాయి జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. అధికారులను గదిలో నిర్బంధించి సమైక్య నినాదాలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలలో 40శాతం ఉత్పత్తులు పడిపోగా, సున్నం పరిశ్రమలు మూడపడ్డాయి. గుంటూరు, గణపవరం, పేరేచర్ల ప్రాంతాల్లోని పలు స్పిన్నింగ్ మిల్లుల్లో నూలు తయారీకి తీవ్ర ఆటంకం కలిగింది. అయోమయంలో రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై ప్రభావం చూపింది. ఏ రైలు నడపాలి, ఏ రైలును రద్దుచేయాలో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే గోదావరి, విశాఖ, గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా నిలిపివేసినట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు ఉదయం ప్రకటించగా, మధ్యాహ్నానికి అత్యవసర సర్వీసులకు విద్యుత్తును పునరుద్ధరించడంతో వాటిని తిరిగి నడిపారు. బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. విశాఖపోర్టులో విద్యుత్ కోత కారణంగా సోమవారం అర్థరాత్రి వచ్చిన నౌకలకు నావిగేషన్ చూపలేకపోవడంతో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌లో మాత్రం కొంచెం పురోగతి కనిపించింది.