రూ.1.25 కోట్ల మేరకు నష్టం
సూళ్లూరుపేట(నెల్లూరు), న్యూస్‌లైన్: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో గురువారం తెల్లవారుజాము స్ప్రాబ్ విభాగంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్(పీఈఎల్) అనే కాంట్రాక్టు సంస్థకు చెందిన స్టోర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ.1.25 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా. షార్ట్ సర్క్యూటై ప్రమాదం జరిగి ఉంటుందని షార్ వర్గాలు భావిస్తున్నాయి. స్టోర్స్‌లో వున్న విలువైన ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలి బూడిదయ్యాయి.
ప్రమాదం జరిగిన స్టోర్స్‌కు కొద్దిదూరంలో వున్న క్యూరింగ్ కాస్టింగ్ ప్లాంటుకు, ఘన ఇంధన ప్లాంటుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ మంటలు షార్ అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా షార్‌లోని రెండో ప్రయోగవేదికపై జీఎస్‌ఎల్వీ డీ5 అనుసంధానం కార్యక్రమం జరుగుతుండటంతో అగ్రిప్రమాదంపై షార్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై విచారణ కోసం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీని వేశారు. కమిటీ ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని షార్ డెరైక్టర్ తెలిపారు.
షార్‌లోని పీఈఎల్ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం
Published Fri, Nov 15 2013 2:26 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement