శ్రీహరికోట: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-23 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. 49 గంటల అనంతరం రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 9.49 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 23 ప్రయోగం జరుగనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-23 అయిదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్కు రానున్నారు.
ఇందుకోసం నరేంద్ర మోడీ 29న చెన్నైకి చేరుకుంటారు. అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకొని.. రాత్రి ప్రత్యేక అతిథిగృహంలోబసచేస్తారు. ఉదయం ప్రయోగాన్ని తిలకించి, 11 గంటలకు తిరిగి చెన్నై వెళ్లి.. అటు నుంచి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా పోలీసులతోపాటు మెరిన్ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రత బలగాలు (సీఐఎస్‌ఎఫ్) పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
నేటి నుంచి పీఎస్‌ఎల్‌వీ -సి 23 కౌంట్ డౌన్
Published Sun, Jun 29 2014 9:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement