సూళ్లూరుపేట: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-23ని ఈ నెల 26న ప్రయోగించాలని నిర్ణయించినా ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ఈ తేదీ మారే అవకాశం ఉంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు మోడీ వచ్చే తేదీలను అనుసరించి ప్రయోగ తేదీ ఖరారు కావచ్చని తెలిసింది. పీఎస్‌ఎల్‌వీ సీ-23కి సంబంధించి నాలుగు దశల అనుసంధానం పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ నెల 16 వరకు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేసి, ప్రయోగ తేదీని ఖరారు చేస్తారు. కాగా, ప్రధాని విచ్చేస్తారని షార్‌లో ఎలాంటి సమాచారమూ లేదు.