సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌకకు ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు.
ఈ ప్రయోగం ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి పంపనుండటం తెలిసిందే. శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎం.ఆర్.ఆర్.) చైర్మన్ కాటూరి నారాయణ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. అనంతరం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ల్యాబ్ సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారమే ప్రయోగాన్ని చేయాలని నిర్ణయించారు. ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్‌ను శుక్రవారం మరోసారి నిర్వహించినట్టు తెలిసింది.
పీఎస్‌ఎల్‌వీ సీ25 కౌంట్‌డౌన్ రేపు ప్రారంభం
Published Sat, Nov 2 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement