
ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12న వేకువజామున 4.04 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్ వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకకు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
పీఎస్‌ఎల్‌వీ సీ41 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఐ (రీప్లేస్‌మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 43వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.