షార్ డైరెక్టర్‌కు ‘సారాభాయ్’ అవార్డు | Vikram sarabhai smaraka award to Shar director | Sakshi
Sakshi News home page

షార్ డైరెక్టర్‌కు ‘సారాభాయ్’ అవార్డు

Published Sun, Jan 11 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

ఎంవైఎస్ ప్రసాద్‌

ఎంవైఎస్ ప్రసాద్‌

సూళ్లూరుపేట: ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్మారక అవార్డుకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు ఇస్రో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో 2014-15 సంవత్సరానికిగాను షార్ డెరైక్టర్ ప్రసాద్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

త్వరలో జరగబోయే కార్యక్రమంలో ప్రసాద్‌కు పసిడి పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నట్టు సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్బీ నిమ్సే పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును ఇస్రో చైర్మన్లు ప్రొఫెసర్ సతీష్ ధవన్, డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్ రాధాకృష్ణన్‌తో పాటు డీఆర్‌డీవో శాస్త్రవేత్త వీకే సారస్వత్ అందుకున్నారు. దేశానికి ఎన్నో సేవలందించిన ప్రసాద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలు, షార్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement