ముంబై: గతంలో గుజరాత్ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానీ పోలీసుల కస్టడీని నుంచి తప్పించుకున్నాడు. సూరత్ లో పేలుళ్లకు సంబంధించి కోర్టుకు తీసుకు వస్తున్న క్రమంలో అతను తప్పించుకుని పారిపోయాడని ఓ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ లో ప్రధాన కార్యకలాపాలన్నంటికీ ఉసానీ ప్రణాళికలు రచిస్తుంటాడు. 2008 లోగుజరాత్ లోని సురత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన ఉసానీని పోలీసులు అరెస్టు చేసి కస్టడీలు ఉంచారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని నిందితులను రాయ్ గడ్ లోని తలోజా జైల్ నుంచి దక్షిణ ముంబైలోని కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉసానీ తప్పించుకుని అనంతరం రాష్ట్ర పోలీసులు అప్రమత్తమైయ్యారు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.