క్రీడాకారిణిపై రెండేళ్లుగా టీచర్ లైంగికదాడి
కోట: రాజస్థాన్‌లోని కోటలో 16 ఏళ్ల హ్యాండ్‌బాల్ క్రీడాకారిణిపై ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ రెండేళ్లుగా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు.
కోటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో అబ్దుల్ హనీఫ్ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ స్కూలు హ్యాండ్‌బాల్ జట్టు తరఫున బాధిత క్రీడాకారిణి ఆడేది. వివిధ నగరాల్లో జరిగిన హ్యాండ్‌బాల్ టోర్నీల్లో ఆమె పాల్గొంది. తనతో కలసి హనీఫ్ టోర్నీలకు వచ్చేవాడని, మారు పేరు, వివరాలతో హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. గత రెండేళ్లలో 7-8 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు. బాధితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.