న్యూఢిల్లీ: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒబామా దంపతులు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఒబామా, మిచెల్ దంపతులకు సేవలు అందించేందుకు హోటల్ యాజమాన్యం 50 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. అవసరమైతే సేవలు అందించేందుకు మరో 20 మందిని సిద్ధంగా ఉంచింది.
ఒబామా దంపతులకు భోజనం, నీళ్లు సరఫరా చేయడం సహా వారికి అవసరమైన సేవలు అందించనున్నారు. భద్రత కారణాల రీత్యా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నెల 25 ఉదయం ఒబామా రానున్నారు. 2010లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇదే హోటల్లో బస చేశారు.
ఒబామా సేవకు 50 మంది హోటల్ సిబ్బంది
Published Wed, Jan 21 2015 8:15 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement
Advertisement