ITC Maurya
-
హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్
హెయిర్ కటింగ్ చేయడంలో జరిగిన పొరపాటుకి శిక్షగా న్యాయస్థానం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి రెండు కోట్ల రూపాయల ఫైన్ విధించింది. మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా గురువారం తీర్పు వచ్చింది. 2018 ఏప్రిల్ 18న మోడల్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసింది. హెయిర్ కటింగ్ చేసుకునేందుకు ఆ రోజు హోటల్లో ఉన్న సెలూన్‌కి ఆ మహిళ వెళ్లింది. ‘ తనకు ఇంటర్వ్యూ ఉందని, జుట్టును కింది నుంచి నాలుగు అంగులాల వరకు కత్తరించమని’ సూచించింది. హెయిర్ డ్రస్సర్ కటింగ్ చేస్తుండగా ఆమె కళ్ల జోడు తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత డ్రెస్సర్ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించుకుంది. తీరా కటింగ్ పూర్తయిన తర్వాత చూస్తే జుట్టును కింది నుంచి కాకుండా మొదలు నుంచి నాలుగు అంగుళాల వరకు ఉండేలా కటింగ్ చేశారు. తనకు జరిగిన నష్టంపై సదరు మహిళ హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా... వారు సరైన స్పందన ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ నేషనల్ కన్సుమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని సంప్రదించింది. హోటల్ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, పైగా వారు ఉపయోగించిన కెమెకల్స్ వల్ల తన స్కాల్ప్ పాడైందంటూ కోర్టుకు విన్నవించింది. తనకు పొడవైన జుట్టు ఉండటం వల్ల పలు ప్రముఖ కంపెనీల షాంపూ యాడ్లలో నటించాని, ప్రస్తుతం తనకు ఆ అవకాశం పోయిందంటూ కోర్టుకు వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఐటీసీ మౌర్య హోటల్లో ఉన్న హెయిర్ డ్రెస్సర్, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించింది. జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 2 కోట్లను బాధిత మహిళకు చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. చదవండి : వర్కింగ్ విమెన్: మీకోసమే ఈ డ్రెస్సింగ్ స్టైల్ -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
3 గంటలు.. రూ.85 కోట్లు
న్యూఢిల్లీ: అగ్రరాజ్య అధిపతి వస్తున్నారంటే ఆయనకిచ్చే విందు భోజనంలో ఏమేం వంటకాలు ఉంటాయా అన్న ఊహే నోరూరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఆ హోటల్లో బుఖారా రెస్టారెంట్ తమ ఆత్మీయ అతిథికి హోటల్లో సంప్రదాయక వంటకాలతో పాటు ఆయనకి నచ్చే రుచులతో ట్రంప్ ప్లేటర్ (ట్రంప్ పళ్లెం) పేరుతో రకరకాల వంటకాలు వడ్డించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఆ మెనూని హోటల్ యాజమాన్యం వెల్లడించలేదు. 2010, 2015లో బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు హోటల్ మౌర్య ఆయన కోసం ప్రత్యేకంగా ఒబామా ప్లేటర్‌ను వడ్డించింది. అప్పటి నుంచి ఆ మెనూ ప్రాచుర్యం పొందింది. ఒబామాకి వడ్డించిన వంటకాల్లో తందూరీ జింగా, మచ్లీ టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్‌లు ఉన్నాయి. బుఖారా రెస్టారెంట్ ప్రధానంగా తందూరీ వంటకాలకే ప్రసిద్ధి. కబాబ్, ఖాస్తా రోటి, భర్వాన్ కుల్చా వంటి వంటకాలు రుచి చూస్తే ప్రాణం లేచొస్తుంది. ట్రంప్‌కి కానుకగా ఈ రెస్టారెంట్ ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ వేసిన అప్రాన్‌ను అందించనుంది. ట్రంప్ రేటింగ్ పెరిగింది ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. ఎవరి మీద ఎలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు. భారతీయులు అంటే చులకన భావం. అమెరికాలో ప్రవాస భారతీయులు వీసా, గ్రీన్‌కార్డు సమస్యలతో తిప్పలు పడుతున్నాయి. అయినా భారత్‌లో ట్రంప్‌కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానం పట్ల 2016లో 16శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉంటే 2019నాటికి ఆ సంఖ్య 56శాతానికి పెరిగింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గత అక్టోబర్‌లో ఈ సర్వే చేసింది. ట్రంప్‌కి మద్దతిచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్‌ను అమెరికా తన నమ్మకమైన నేస్తంగా చూస్తోంది. 3 గంటలు.. రూ.85 కోట్లు అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి గుజరాత్ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం రోడ్ షోతోపాటు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. భద్రతా ఏర్పాట్లు, ట్రంప్ ప్రయాణించే రహదారుల మరమ్మతు, ట్రంప్ ఆతిథ్యానికి దాదాపు రూ.85 కోట్లు ఖర్చు అవుతున్నట్టుగా నగర కార్పొరేషన్ అధికారులు చెప్పారు. నగరంలో ట్రంప్ ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంటారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు 22 కి.మీ. మేర రోడ్లను ఆధునీకరించడానికే రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. రూ.6 కోట్లను సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం అత్యధికంగా ఖర్చు అవుతోంది. అహ్మదాబాద్‌లో కాన్వాయ్ ట్రయల్స్ ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 ► అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. ► గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. ► తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ► అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్‌లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. ► సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ► ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 25 ► రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ► ట్రంప్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ► అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ► మోదీ, ట్రంప్‌ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. ► అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. ► రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ఒబామా సేవకు 50 మంది హోటల్ సిబ్బంది
న్యూఢిల్లీ: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒబామా దంపతులు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఒబామా, మిచెల్ దంపతులకు సేవలు అందించేందుకు హోటల్ యాజమాన్యం 50 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. అవసరమైతే సేవలు అందించేందుకు మరో 20 మందిని సిద్ధంగా ఉంచింది. ఒబామా దంపతులకు భోజనం, నీళ్లు సరఫరా చేయడం సహా వారికి అవసరమైన సేవలు అందించనున్నారు. భద్రత కారణాల రీత్యా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నెల 25 ఉదయం ఒబామా రానున్నారు. 2010లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇదే హోటల్లో బస చేశారు.