జెట్ ఎయిర్‌వేస్ పైలట్‌పై హర్భజన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జెట్ ఎయిర్‌వేస్ పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దివ్యాంగుడితో పాటు మహిళను జెట్ ఎయిర్‌వేస్ పైలట్ దూషించడమే కాకుండా దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని హర్భజన్ మండిపడ్డాడు. ఫారిన్ పైలట్ అనుచిత వ్యాఖ్యలపై (పైలట్... యూ బ్లడీ ఇండియన్ గెట్ అవుట్ మై ఫ్లయిట్) అతడు తన ట్విట్టర్‌లో వరుసగా ట్విట్‌ల వర్షం కురిపించాడు.
So called this Bernd Hoesslin a pilot with @jetairways called my fellow indian(u bloody indian get out of my flight)while he is earning here
— Harbhajan Turbanator (@harbhajan_singh) 26 April 2017
జెట్ ఎయిర్‌వేస్ పైలట్ బెర్నాడ్ హోస్లిన్ దురహంకార ప్రవర్తనను భజ్జీ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పరిణామం జెట్ ఎయిర్వేస్కు అవమానకరమని అతడు పేర్కొన్నాడు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పైలట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హర్భజన్ డిమాండ్ చేశారు.
Not only was he racist but physically assaulted a lady and abused a physically challenged man..absolutely disgraceful &shame on @jetairways
— Harbhajan Turbanator (@harbhajan_singh) 26 April 2017
Strict action must b taken &such things should not be allowed or tolerated in r country.. #proudtobeindian let's get together and sort this
— Harbhajan Turbanator (@harbhajan_singh) 26 April 2017
ఈ సంఘటన ఏప్రిల్ 3న జరిగిందని అతడు పేర్కొన్నాడు. మరోవైపు హర్భజన్ వ్యాఖ్యలపై జెట్ ఎయిర్‌వేస్ స్పందించింది. ఈ సంఘటనపై చింతిస్తున్నామని, పైలెట్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది.