అది మోడీ ఘనత కాదు | He was not credited for it | Sakshi
Sakshi News home page

అది మోడీ ఘనత కాదు

Published Sun, Mar 23 2014 4:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అది మోడీ ఘనత కాదు - Sakshi

అది మోడీ ఘనత కాదు

ప్రజల కష్టంతోనే గుజరాత్ అభివృద్ధి: రాహుల్
 

 
గుజరాత్‌లో అభివృద్ధి ఘనత మోడీది కాదని.. అది అక్కడి ప్రజల శ్రమ, కష్టం వల్ల వచ్చిందనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ అశాంతికి దారితీసే రాజకీయాలు చేస్తోందని... ఆ పార్టీకి అధికారమే పరమావధి అంటూ విమర్శలకు పదును పెట్టారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రతాప్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ శనివారం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.



స్థానికంగా రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో రాహుల్ బీజేపీని, గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘గుజరాత్‌లో అభివృద్ధి అంతా తన ఘనతేనని బీజేపీ నేత చెప్పుకుంటున్నారు. కానీ, అది లక్షలాది మంది ప్రజల కృషి అని ఆయన విస్మరిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌లోని మారుమూల గ్రామాల్లోని మహిళల కష్టమే అమూల్‌వంటి విజయగాథలకు కారణమైందని మరచిపోతున్నారు’’ అని రాహుల్ అన్నారు. అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ విధానమని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement