సంబరాలు చేసుకున్న హిందుసేన | Hindu Sena celebrates Donald Trump's win | Sakshi
Sakshi News home page

సంబరాలు చేసుకున్న హిందుసేన

Published Thu, Nov 10 2016 11:09 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

సంబరాలు చేసుకున్న హిందుసేన - Sakshi

సంబరాలు చేసుకున్న హిందుసేన

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో హిందుసేన సంబరాలు చేసుకుంది. ట్రంప్‌ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బాజాలు మోగిస్తూ, స్వీట్లు పంచుకుని హిందుసేన కార్యకర్తలు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. ట్రంప్‌ విజయంతో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత మెరుగవుతాయని హిందుసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అన్నారు.

‘అమెరికా ఎన్నికల ఫలితాలు మాకెంతో ఆనందం కలిగించాయి. ట్రంప్‌ విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది. ఇప్పుడు అమెరికాకు భారత్‌ సన్నిహిత దేశమవుతుంది. తీవ్రవాదం నిర్మూలనకు భారత్‌, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయ’ని విష్ణు గుప్తా పేర్కొన్నారు. ట్రంప్‌ విజయం కోసం మే నెలలో హిందూసేన ప్రత్యేక ప్రార్థనలు చేసింది. జూన్‌ లో ట్రంప్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement