ప్రవీణ్ తొగాడియా
హైదరాబాద్: మతం మారినవారిని తిరిగి హిందువులుగా మారుస్తామని విశ్వహిందూపరిషత్(విహెచ్పి) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఈ రాష్ట్రంలో నిజాం సర్కార్ తేవాలని చూస్తే ప్రతి వ్యక్తి సర్దార్ పటేల్‌గా మారతాడని హెచ్చరించారు. ముస్లింలు, క్రైస్తవులు హిందువుల వారసులేనని అన్నారు.
హిందువులు అంతా ఐకమత్యంగా ఉంటే హిందువులలో ఎవరూ పేదరికంలో ఉండరని అన్నారు. దేశంలో హిందూ రాజ్యం వచ్చిందని, ఈ రాష్ట్రంలో కూడా హిందూ రాజ్యం రావాలన్న ఆకాంక్షను తొగాడియా వ్యక్తం చేశారు.