సెల్‌ఫోన్ వాడారో... చచ్చారే!
Published Fri, Sep 1 2017 12:40 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
► మొబైల్స్, సోషల్ మీడియా వాడొద్దంటున్న హిజ్బుల్
► వాడితే ప్రమాదం తప్పదని హెచ్చరికలు
► సైన్యం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించే అవకాశం
శ్రీనగర్: మొబైల్స్, సోషల్ మీడియానును ఇకపై వినియోగించడం మానుకోవాలని వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ తన సభ్యులకు హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ సిగ్నల్స్‌ఆధారంగా సైన్యం మిలిటెంట్లను మట్టు పెడుతోందని హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీమ్ కమాండర్ సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు.
గత నెల్లో సైన్యం చంపిన హిజ్బుల్ టాప్ కమాండర యాసీన్, మరో 12 మంది మిలిటెంట్ల ఆచూకీని సిగ్నల్స్ ఆధారంగానే సైన్యం గుర్తించిందని ఆయన చెప్పారు. ఎంత ఎక్కువగా సాంకేతికతను ఉపయోగించుకుంటే అంత త్వరగా సైన్యానికి చిక్కుతారని.. సలావుద్దీన్ ఈ సందర్భంగా మిలిటెంట్లను హెచ్చరించారు. టెక్నాలజీ లేని రోజుల్లో.. 1990 ప్రాంతంలో భారత్‌పై ఎన్నో విజయవతంమైన దాడులు చేశామని.. ఇప్పుడు సాంకేతిక అవసరం లేదని మిలిటెంట్లకు సూచించారు.
హిజ్బుల్ ముజీహిదీన్ టాప్‌కమాండర్ ప్రకటనపై స్పందించిన పోలీసులు అధికారులు.. కొంత కాలంగా హిజ్బుల్ మిలిటెంట్లను సెల్‌ఫోన్స్ సిగ్నల్స్, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు. చాలామంది టెర్రరిస్టుల ఫోన్‌కాల్స్ ట్రాక్ చేశామని వెల్లడించారు.
Advertisement