అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటే అర్థం కాకపోవచ్చు. కాని ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించే సంస్థ అనగానే గుర్తు పట్టేస్తారు. ఆ సంస్థకు ఒక కల ఉంది. అదేంటంటే పెద్ద హాలీవుడ్ మ్యూజియం ఏర్పాటు చేయడం. అద్భుతమైన సినిమాల స్క్రీన్‌ప్లేలు, కాస్ట్యూమ్స్, కెమెరాలు, ఫిల్మ్ మేకింగ్‌పై వచ్చిన పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఒక్కటనేంటి ఒక సినిమా ప్రపంచాన్నే ఆ మ్యూజియంలో ఆవిష్కరించాలని ఆ సంస్థ కల. ఎప్పట్నుంచో ఈ కల కోసం సంస్థ కష్టపడుతున్నా ఇప్పటికి అన్నీ కుదిరేశాయి.
ఆరున్నర ఎకరాల్లో అదిరిపోయే హంగులతో లాస్ ఏంజిల్స్‌లో ఈ మ్యూజియం రెడీ అవుతుంది. ఇది 2019కల్లా రెడీ కానుంది. ఇందులో వెయ్యి మంది కూర్చునేలా ఒక పెద్ద థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. సినిమాలంటే ఇష్టమున్నవాళ్లు మ్యూజియమ్‌కు వస్తే నోరెళ్లబెట్టేలా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతానికి ఆస్కార్‌కు లైబ్రరీ ఉన్నా అది అందరికీ అందుబాటులో లేదు. కొత్తగా వస్తోన్న మ్యూజియం మాత్రం అందరి కోసం! సినిమాను ప్రేమించే అందరి కోసం!!
Comments
Please login to add a commentAdd a comment