ప్రయాగ్‌రాజ్ (లక్నో) : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నగరంలోని ఓ కాలనీలో వీధులన్నీ కాషాయ రంగులో దర్శనమిచ్చాయి. అంతేకాకుండా దాదాపు అన్ని ఇళ్లకు దేవుని ప్రతిమలతో సహా మతపరమైన బొమ్మలు చిత్రీకరించారు. ఈ కుట్రలోయూపీ మంత్రి నంద్ గోపాల్ నంది హస్తం ఉందని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున కొందరు దుండగులు తన ఇంటి బాల్కనీకి కాషాయరంగు పెయింటింగ్ వేస్తుండటంతో స్థానిక నివాసి రవిగుప్తా.. పెయింటింగ్ ఆపాలంటూ కోరారు. అయితే సదరు వ్యక్తులు వినడం సరికదా మరింత ఓవరాక్షన్ చేశారు. మంత్రి నంది ఆదేశాల మేరకే ఈ పని చేస్తున్నామన్నామంటూ ఆ సమూహంలోని ఓ వ్యక్తి బదులిచ్చాడు.
దీనికి సంబంధించి వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో మంత్రి నంది తీరుపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మీకున్న మత పిచ్చిని అందరికి అంటగట్టడం ఏంటంటూ పలువురు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కమల్ కుమార్ కేసర్వానీని చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. కాగా నంద్ గోపాల్ నందికి కేసర్వాని సమీప బుందువుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన కారణంగా తనను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని గుప్తా వాపోయాడు. ఈ విషయంపై మంత్రి నంద్ గోపాల్‌ను సంప్రదించగా ఇది కేవలం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. భవనాలకు కేవలం కాషాయ రంగు మాత్రమే లేదని ఎరుపు, పసుపు, సహా మరికొన్ని రంగులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం అభివృద్ధని అడ్డుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఇవి అంటూ తనపై వచ్చిన ఆరోపణల్ని మంత్రి కొట్టిపరేశారు.
Comments
Please login to add a commentAdd a comment