పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి | Hope children absorb cleanliness message: Arun Jaitley | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి

Published Sat, Nov 15 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి

పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి

జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ : పరిశుభ్రత అనేది జీవితంలో ఓ భాగంగా మారాలని కేంద్ర సమాచార, ప్రసార  శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక సిరిఫోర్ట్ ఆడిటోరియంలో శుక్రవారం జాతీయ బాలల చలనచిత్స్రోవ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్రోత్సవంలో భాగంగా నగరంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామన్నారు.

పరిశుభ్రత కార్యక్రమం చిన్నారుల హృదయాల్లో నాటుకుపోతుందని ఆయన ఆకాంక్షించారు. పసివయసులో ఒత్తిడి అనే పదానికి తావేఉండబోదని, ఆ సమయంలో నేర్చుకున్నందంతా జీవితాంతం గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సినిమా అనేది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, కొన్ని సినిమాలు విజ్ఞానాన్ని పెంచుతాయని అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ బెనెగల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ఆయన ఇటీవల అనేక ధారావాహికలను తీశారన్నారు. ఈ వయసులో కూడా ఆయన అందరికీ విజ్ఞానాన్ని పంచుతున్నారన్నారు.
 
‘స్వచ్ఛ్’ను ముందుకు తీసుకెళుతున్నాం
అనంతరం సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను తమ శాఖ ముందుకు తీసుకెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి దియా మీర్జా, బుల్లితెర నటి సాక్షి తన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా జాతీయ బాలల చలనచిత్రోత్సవంలోభాగంగా తొలిరోజు ‘పప్పూ కీ పుగాడి’ తదితర సినిమాలను ప్రదర్శించారు.
 
అదృష్టవంతురాలిని : సాక్షి తన్వర్
అనంతరం బుల్లితెర నటి సాక్షి తన్వర్ మాట్లాడుతూ తానెంతో అదృష్టవంతురాలినని, కంప్యూటర్ రహిత బాల్యాన్ని గడిపానని పేర్కొన్నారు. ప్రస్తుత తరం చిన్నారులు కంప్యూటర్ ముందే కాలం గడుపుతున్నారని, బయటికి వెళ్లి ఆడుకోవడం లేదని అన్నారు. కాగా చలనచిత్రోత్సవం సందర్భంగా చిన్నారులు తొలుత వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రోత్సవం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఎస్‌ఐ) ఆధ్వర్యంలో జరుగుతోంది.
 
చిన్ననాటినుంచే పాల్గొంటున్నా : దియామీర్జా
అనంతరం బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ ‘జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం ఓ గౌరవంగా భావిస్తున్నా. నా స్వస్థలం హైదరాబాద్‌లో 16వ అంత ర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రారంభించా. పాఠశాల దశ నుంచే జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పాల్గొంటున్నా. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించగానే అందుకు సరేనని చెప్పా’అని అంది. చిన్నారులపై సినిమాలు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని, స్ఫూర్తినిస్తాయని అంది.
 
నా జీవిచరిత్రను తెరకెక్కించడం ఇష్టం లేదు
తన జీవితచరిత్రపై సినిమా రావాలని అభిలషించడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ అంబాసిడార్ సానియామీర్జా పేర్కొంది. ఒక వేళ తీయడమంటూ జరిగితే తన పాత్రలో బాలీవుడ్ హిరోయిన్ దీపికా పదుకొనే నటించాలనే ఆకాంక్షను సానియా వెల్లడించారు.
 శుక్రవారం జాతీయ బాలల చలన చిత్ర ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ఇటీవల ఓ చిత్ర దర్శకుడు సినిమా తీయాలని చేసిన సూచనను తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. ‘తన జీవిత చరిత్రను తెరకు ఎక్కించడం తనకు ఇష్టం లేదని, తన వ్యక్తిగత విషయాలను ప్రజలతో పంచుకోలేనని, తెరపై ప్రదర్శించడం తనకు ఇష్టం లేదని’ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసి సినిమా తీస్తామని చెప్పిన నిర్మాతలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని చెప్పారు. ఒక వేళ భవిషత్‌లో తనలో ఏదైనా మార్పు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తన జీవిత చరిత్రపై సినిమా తీస్తే, అందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ‘సానియా’ పాత్రలో నటించడం తనకిష్టమని ఆమె చెప్పారు. ఇది ఆమె జీవిత చరిత్రపై సినిమా తీయడానికి ఎప్పుడైనా అంగీకరించ వచ్చనే దానికి సంకేతం.. ఇక ఆమె అభిమానులు, క్రీడాకారుల్లో ఆశల్ని లేపింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రముఖ క్రీడాకారుల జీవితాల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సు ఆఫీసుల్ని బద్దలు కొట్టాయి.  ‘పాన్‌సింగ్ తోమర్’, ‘భాగ్ మిల్కా భాగ్’(అథ్లెటిక్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చినవే), తాజాగా వచ్చిన ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీకోమ్’ కూడా బాక్సింగ్‌లో ఒలింపిక్ గోల్డ్‌మెడల్ విజేత జీవిత చరిత్ర ఆధారం తీసిందే.
 
‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’
 ప్రస్తుతం భర్త పాకిస్థానీ క్రికెటర్ సోయాబ్ మాలిక్‌తో కలిసి తన జీవిత చరిత్ర ఆధారంగా రాస్తున్న ‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’ అనే పుస్తక రచనలో   బిజీగా ఉన్నారు. ఇప్పటికే 26 చాప్టర్లు పూర్తి అయ్యాయి. ‘అన్ని విషయాలు, అడ్డంకులను 2012 నుంచి ఇప్పటిదాకా కూలంకషంగా పుస్తకంలో చర్చించినట్లు సానియా తెలిపారు. మరికొన్ని చాప్టర్లను పూర్తి చే యాల్సింది ఉన్నదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement