Hygiene program
-
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
‘దుమ్ము’ దులపండి..!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్‌ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం 20లోగా క్లీన్ చేయాలి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు శానిటైజేషన్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. -
హరిత ప్రణాళికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో హరిత ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 530 గ్రామాల్లో మినహా మొత్తం 12,221 పంచాయతీల్లో గ్రీన్ ప్లాన్ రూపొందించుకున్నట్లు గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు అందజేశారు. ఈ ప్రణాళికలో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడం, నాటిన మొక్కలను కాపాడుకోవడం ముఖ్యకర్తవ్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచడం, వాటిని గుర్తించినచోట్ల నాటడం, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు యజమానులకు పంపిణీ చేయడం, వాటి సంరక్షణ చర్యలను గురించి హరిత ప్రణాళికల్లో వివరిస్తున్నారు. 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక .. ప్రస్తుతం గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక చురుకుగా అమలవుతున్న నేపథ్యంలో 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికకు తుదిరూపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకుని ఏడాది పొడవునా నిర్వహించేలా 365 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తీర్మానాలను పంచాయతీ, గ్రామసభల్లో తీర్మానం చేసుకుని ఏడాది అంతా అభివృద్ధి పనులు కొనసాగించే దిశలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామాల్లో నియమితులైన స్టాండింగ్ కమిటీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీల పాలకవర్గాలు ఈ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు గాను 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికలు సిద్ధమైనట్టు పీఆర్‌శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్న గ్రామాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి తమ నివేదికలను అందజేసినట్టు సమాచారం. వార్షిక ప్రణాళికలో భాగంగా వారంలో ఒక రోజు వీధుల్లో, గ్రామంలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి శ్రమదానం, మొక్కలు నాటడంతోపాటు గ్రామసభల్లో అందరూ కలిసి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. -
పరిశుభ్రతపై అవగాహన ఉండాలి
చుంచుపల్లి ఖమ్మం : గ్రామాలన్నింటినీ పారిశుద్ధ్యం వైపు నడిపించేందుకు పరిశుభ్రతపై అవగాహన అవసరమని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పి.జగత్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం డీఆర్డీఓ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిలో పిల్లల ద్వారా పారిశుద్ధ్యాన్ని అమలు చేయించి, వారి ద్వారా గ్రామంలో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారిణి డి.వాసంతి మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ మిషన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉండాలని కోరారు. అనంతరం సర్వేక్షణ్ గ్రామీణ్–2018 యాప్ గురించి, ఆన్లైన్ ఓటింగ్ గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసిన కిట్లలో జూట్ బ్యాగు, బకెట్, మగ్, టాయిలెట్ క్లీన్ బ్రష్, డెటాల్ సబ్బు, సేల్ కట్టర్, డిటర్జెంట్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.విజయచంద్ర, ఎస్బీఎం కన్సల్టెంట్స్ రేవతి, ఖాదర్‌పాషా, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
హైజీన్ కిట్స్’ పంపిణీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ప్రభుత్వం పంపిణీ చేయ తలపెట్టిన ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్స్’ సరఫరాకు అడ్డంకులు తొలగిపోయాయి. కిట్స్ సరఫరా టెండర్‌ను మా యార్న్ అండ్ ఫైబర్స్‌కు కట్టబెడుతూ తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమను అనర్హులుగా ప్రకటిస్తూ మా యార్న్ అండ్ ఫైబర్స్ సంస్థకు హైజీన్ కిట్ల సరఫరా కాంట్రాక్టును అప్పగిస్తూ టీఎస్ఈడబ్ల్యూఐడీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లైట్‌హౌస్ ప్రమోషన్స్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు టెండర్‌పై స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ మా యార్న్ అండ్ ఫైబర్స్ సంస్థ యజమాన్యం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ చేపట్టగా అప్పిలెట్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ లైట్‌హౌస్ ప్రమోషన్స్ కంపెనీ అవాస్తవాలతో సింగిల్ జడ్జిని తప్పుదోవ పట్టించిందని తెలిపారు. నిబంధనల మేరకే తాము టెండర్‌ను దక్కించుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన వెంటనే కిట్ల సరఫరా నిమిత్తం భారీ మొత్తంలో ఖర్చు చేశామని, స్టే ఉత్తర్వుల వల్ల తమకు భారీ నష్టం కలు గుతోందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కిట్ల సరఫరా టెండర్‌పై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
గోశాల ఘోష!
గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి. కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది. చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్ డ్రెయినేజీకి రూ.8 లక్షలు, కాంక్రీట్ ప్లాట్పామ్ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు. ఏం చేశారంటే.. సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్‌పాం నిర్మించారు. మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు. గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం. ఎస్కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ -
పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి
జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ : పరిశుభ్రత అనేది జీవితంలో ఓ భాగంగా మారాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక సిరిఫోర్ట్ ఆడిటోరియంలో శుక్రవారం జాతీయ బాలల చలనచిత్స్రోవ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్రోత్సవంలో భాగంగా నగరంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామన్నారు. పరిశుభ్రత కార్యక్రమం చిన్నారుల హృదయాల్లో నాటుకుపోతుందని ఆయన ఆకాంక్షించారు. పసివయసులో ఒత్తిడి అనే పదానికి తావేఉండబోదని, ఆ సమయంలో నేర్చుకున్నందంతా జీవితాంతం గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సినిమా అనేది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, కొన్ని సినిమాలు విజ్ఞానాన్ని పెంచుతాయని అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ బెనెగల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ఆయన ఇటీవల అనేక ధారావాహికలను తీశారన్నారు. ఈ వయసులో కూడా ఆయన అందరికీ విజ్ఞానాన్ని పంచుతున్నారన్నారు. ‘స్వచ్ఛ్’ను ముందుకు తీసుకెళుతున్నాం అనంతరం సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను తమ శాఖ ముందుకు తీసుకెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి దియా మీర్జా, బుల్లితెర నటి సాక్షి తన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా జాతీయ బాలల చలనచిత్రోత్సవంలోభాగంగా తొలిరోజు ‘పప్పూ కీ పుగాడి’ తదితర సినిమాలను ప్రదర్శించారు. అదృష్టవంతురాలిని : సాక్షి తన్వర్ అనంతరం బుల్లితెర నటి సాక్షి తన్వర్ మాట్లాడుతూ తానెంతో అదృష్టవంతురాలినని, కంప్యూటర్ రహిత బాల్యాన్ని గడిపానని పేర్కొన్నారు. ప్రస్తుత తరం చిన్నారులు కంప్యూటర్ ముందే కాలం గడుపుతున్నారని, బయటికి వెళ్లి ఆడుకోవడం లేదని అన్నారు. కాగా చలనచిత్రోత్సవం సందర్భంగా చిన్నారులు తొలుత వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రోత్సవం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) ఆధ్వర్యంలో జరుగుతోంది. చిన్ననాటినుంచే పాల్గొంటున్నా : దియామీర్జా అనంతరం బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ ‘జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం ఓ గౌరవంగా భావిస్తున్నా. నా స్వస్థలం హైదరాబాద్‌లో 16వ అంత ర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రారంభించా. పాఠశాల దశ నుంచే జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పాల్గొంటున్నా. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించగానే అందుకు సరేనని చెప్పా’అని అంది. చిన్నారులపై సినిమాలు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని, స్ఫూర్తినిస్తాయని అంది. నా జీవిచరిత్రను తెరకెక్కించడం ఇష్టం లేదు తన జీవితచరిత్రపై సినిమా రావాలని అభిలషించడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ అంబాసిడార్ సానియామీర్జా పేర్కొంది. ఒక వేళ తీయడమంటూ జరిగితే తన పాత్రలో బాలీవుడ్ హిరోయిన్ దీపికా పదుకొనే నటించాలనే ఆకాంక్షను సానియా వెల్లడించారు. శుక్రవారం జాతీయ బాలల చలన చిత్ర ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల ఓ చిత్ర దర్శకుడు సినిమా తీయాలని చేసిన సూచనను తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. ‘తన జీవిత చరిత్రను తెరకు ఎక్కించడం తనకు ఇష్టం లేదని, తన వ్యక్తిగత విషయాలను ప్రజలతో పంచుకోలేనని, తెరపై ప్రదర్శించడం తనకు ఇష్టం లేదని’ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసి సినిమా తీస్తామని చెప్పిన నిర్మాతలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని చెప్పారు. ఒక వేళ భవిషత్లో తనలో ఏదైనా మార్పు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రపై సినిమా తీస్తే, అందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ‘సానియా’ పాత్రలో నటించడం తనకిష్టమని ఆమె చెప్పారు. ఇది ఆమె జీవిత చరిత్రపై సినిమా తీయడానికి ఎప్పుడైనా అంగీకరించ వచ్చనే దానికి సంకేతం.. ఇక ఆమె అభిమానులు, క్రీడాకారుల్లో ఆశల్ని లేపింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రముఖ క్రీడాకారుల జీవితాల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సు ఆఫీసుల్ని బద్దలు కొట్టాయి. ‘పాన్‌సింగ్ తోమర్’, ‘భాగ్ మిల్కా భాగ్’(అథ్లెటిక్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చినవే), తాజాగా వచ్చిన ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీకోమ్’ కూడా బాక్సింగ్‌లో ఒలింపిక్ గోల్డ్‌మెడల్ విజేత జీవిత చరిత్ర ఆధారం తీసిందే. ‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’ ప్రస్తుతం భర్త పాకిస్థానీ క్రికెటర్ సోయాబ్ మాలిక్‌తో కలిసి తన జీవిత చరిత్ర ఆధారంగా రాస్తున్న ‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’ అనే పుస్తక రచనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 26 చాప్టర్లు పూర్తి అయ్యాయి. ‘అన్ని విషయాలు, అడ్డంకులను 2012 నుంచి ఇప్పటిదాకా కూలంకషంగా పుస్తకంలో చర్చించినట్లు సానియా తెలిపారు. మరికొన్ని చాప్టర్లను పూర్తి చే యాల్సింది ఉన్నదన్నారు.