లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో ఓ హాస్పిటల్ ..ముస్లింలను అనుమతించొద్దంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. వాలంటీస్ అనే క్యాన్సర్ హాస్పిటల్..ముస్లింలకు కరోనావైరస్ సోకలేదని నిర్దారణ అయ్యాకే వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటామంటూ పేర్కొంది. ఈ మేరకు ఓ పత్రికలో యాడ్ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తికి జమాత్‌కు వెళ్లొచ్చిన ముస్లింలే కారణమంటూ ఆరోపించింది. అంతేకాకుండా హిందువులు, జైనులను కూడా దుర్మార్గులు అంటూ దూషణలు గుప్పిస్తూ.. ఈ రెండు సంపన్న వర్గాలు పీఎం కేర్స్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ పత్రికా ప్రకటన కాస్తా వివాదాస్పదం అవడంతో హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతాలను కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినందుకు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ర్టాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి జనసాంద్రతలో దాదాపు 20 శాతం మంది ముస్లింలే ఉన్నారు. రాష్ర్టంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 60 శాతం మందికి జమాత్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 150కి పైగా కంటైన్మెంట్ జోన్లను గుర్తించిన అధికారులు మీరట్ ప్రాంతంలోనే 70 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం యూపీ అంతటా 970 కరోనా కేసులు నమోదుకాగా, 14 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment