గర్భణీతో ఉన్న భార్యను గొంతునులుమి చంపిన భర్త | Husband strangles his pregnant wife to death, New Delhi | Sakshi
Sakshi News home page

గర్భణీతో ఉన్న భార్యను గొంతునులుమి చంపిన భర్త

Published Thu, Oct 30 2014 9:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

Husband strangles his pregnant wife to death, New Delhi

ఐదు నెలల గర్భంతో వున్నభార్యను ఓ కసాయి భర్త గొంతునులుమి చంపిన ఘటన తూర్పు ఢిల్లీలోని కొత్త ఉస్మాన్ పూర్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కలీ చరణ్ అలీయాస్ కల్లు అనే వ్యక్తి తన భార్య బబ్లీ (35)ని హతమార్చాడు. కలీ చరణ్ తన భార్య బబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని  బావమరిది భోలే శంకర్ కు ఫోన్ చేసి చెప్పాడు.  దాంతో  సోదరిని చూసేందుకు ఉదయం ఇంటికి వచ్చిన తనకు బబ్లీ శవమై కనిపించిందని శంకర్ పోలీసులకు చెప్పాడు.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కలీ చరణ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు కల్లును తమ పద్దతిలో విచారించగా  చివరకు తన నేరాన్నిఅంగీకరించినట్టు చెప్పారు. అయితే భార్యభర్తల వైవాహిక జీవితంలో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని, దాంతో వారిద్దరూ తరుచూ గొడవపడుతూ ఉండేవారని ఇరుగుపోరుగు వారు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, మృతురాలు బబ్లీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement