'అంతా ఉత్తిదే.. నేను సీఎం రేసులో లేను' | I am not UP's CM candidate: Rajnath | Sakshi
Sakshi News home page

'అంతా ఉత్తిదే.. నేను సీఎం రేసులో లేను'

Published Fri, Jun 10 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

'అంతా ఉత్తిదే.. నేను సీఎం రేసులో లేను'

'అంతా ఉత్తిదే.. నేను సీఎం రేసులో లేను'

లక్నో: తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళుతుందని వస్తున్న వార్తా కథనాలను ఆయన తప్పుబట్టారు. అవి పూర్తిగా అవాస్తవంతో కూడిన విషయాలు అని చెప్పారు.

ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉన్నా తన మద్దతును పూర్తిస్థాయిలో వారికి ఇస్తానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీలోని చార్ భాగ్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టతను ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement