నాకూ ప్రధాని అర్హతలున్నాయి..! | 'I Can Make Tea, Play Drums, I'm Qualified To Be PM': Azam Khan | Sakshi
Sakshi News home page

నాకూ ప్రధాని అర్హతలున్నాయి..!

Published Wed, Oct 19 2016 3:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

నాకూ ప్రధాని అర్హతలున్నాయి..! - Sakshi

నాకూ ప్రధాని అర్హతలున్నాయి..!

సహారణ్‌పూర్: ‘ప్రధానికి ఉండాల్సిన అర్హతలన్నీ నాకున్నాయి. నేనూ టీ తయారు చేయగలను.. డ్రమ్స్ వాయించగలను.. సూట్, బూట్‌తో మంచిగా డ్రెస్ చేసుకోగలను.. వంట చేయగలను.. నేనూ అందంగానే ఉంటాను. అవినీతిపరుణ్నీ కాదు. అంతేకాదు ప్రధాని అయిన ఆరు నెలల్లో దేశంలోని 130 కోట్ల ప్రజలందరికీ ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు వారివారి అకౌంట్లలో జమ చేస్తాను’

అని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్ ప్రధాని మోదీని వ్యంగ్యంగా విమర్శించారు. మోదీ కూడా నల్లధనం వెలికితీసి ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం తెలిసిందే. స్థానికంగా జరిగిన ఈ-రిక్షాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆజమ్ ఖాన్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement