నా జీవిత కథ నేనే రాస్తా...: సోనియా
న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ శాఖామంత్రి నట్వర్ సింగ్ ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’విడుదలకు ముందే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పుస్తకంలో సోనియాగాంధీ, రాహుల్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి కారణమయ్యాయి. తనపై చేసిన వ్యాఖ్యలపై సోనియా స్పందిస్తూ నట్వర్ సింగ్ కు చురకలంటించారు.
ఓ ఆంగ్ల టెలివిజన్ చానెల్ రిపోర్టర్ సునీల్ ప్రభు కిచ్చిన ఇంటర్వ్యూలో నా జీవిత కథ నేనే రాస్తా. అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని సోనియా వ్యాఖ్యానించారు.
సోనియా ప్రధాని కాకపోవడానికి వెనకున్న కారణాలను తన ఆత్మకథలో వివరించానని ఒక ఆంగ్ల వార్తాచానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.