One life is not enough
-
సీక్వెల్ తో మరీ వెంటాడతారట?
సినిమాలే కాదు ఇప్పుడు పుస్తకాలకు కూడా సీక్వెల్..... వస్తున్నాయి. సీక్వెల్ రావటంలో విశేషం ఏమీ లేకున్నా.... గతంలో చాలా పుస్తకాలు అలా వచ్చివవే. అయితే నిను వీడని నీడను నేనే..... అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి నట్వర్ సింగ్ మళ్లీ వెంటాడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకం పేరు సోనియాపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన ఆయన...ఈసారి సీక్వెల్ పుస్తకంలో కడిగి పారేస్తానని చెబుతున్నారు. తన పుస్తకానికి కొనసాగింపుగా మరో పుస్తకాన్ని (సీక్వెల్) రాసి మరిన్ని విషయాలు బయట పెట్టేందుకు నిర్ణయించుకున్నారట. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా నట్వర్ సింగ్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఈసారి ‘మై ఇర్రెగ్యులర్ డైరీ’ పేరుతో పుస్తకం రాస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పుస్తకం అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది మార్చి వరకూ వేచి చూడాల్సిందే. ఇటీవలి విడుదల అయిన ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకానికి మాత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ బుక్ హాట్ కేక్‌ల్లా 50వేల ప్రతులు అమ్ముడు పోవటంతో... ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు పునర్ ముద్రిస్తున్నారు. మరి ఈసారి నట్వర్ సింగ్ తన డైరీ ద్వారా ఎలాంటి మాటల తూటాలు వదులుతారనేది ఇప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. -
నా ఆత్మకథకు సీక్వెల్ వస్తోంది: నట్వర్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఇతర నేతలపై పదునెక్కిన విమర్శల్ని ఎక్కుపెడుతూ మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ చుట్టు వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు తన ఆత్మకథకు సీక్వెల్ రూపొందించనున్నట్టు నట్వర్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఆత్మకథకు సీక్వెల్ గా వచ్చే పుస్తకానికి 'మై ఇర్రెగ్యులర్ డైరీ' అని పేరు పెట్టారు. సీక్వెల్ ను మార్చి నెలలో మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. గాంధీ కుటుంబ వ్యవహారతీరును, కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకత్వంపై మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని సూచనప్రాయంగా నట్వర్ వెల్లడించారు. నట్వర్ సింగ్ రచించిన 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే ఆత్మకథ మరో నాలుగు రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కలిసిన నేపథ్యంలో ఏమైనా అంశాలను తొలగించారా అనే ప్రశ్నకు ఒక పదాన్ని కూడా తీయకుండా తన ఆత్మకథ మార్కెట్ లోకి రాబోతుందన్నారు. -
సోనియాపై మరోసారి నట్వర్ వివాదస్పద వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్ నుంచి జాంబియా సీనియర్ నేత కెన్నెత్ కౌండాను మరో హోటల్ కు అమర్యాదపూర్వకంగా తరలించారు అని తన ఆత్మకథంలో నట్వర్ సింగ్ పేర్కొన్నారు. స్వాతంత్రం సిద్ధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కౌండా బరకాంబ రోడ్డులోని లలిత్ సూరి హోటల్ లో బస చేశారు. లలిత్ సూరి హోటలో బస చేశారని తెలుసుకున్న సోనియా.. తనను పిలిచి కౌండాను ఒబెరాయ్ హోటల్ కు షిప్ట్ చేయాలని చెప్పారని తన ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో వెల్లడించారు. ఏన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న కౌండాను ఈ సమాచారాన్ని చేరవేయడం బాధించిందని నట్వర్ తెలిపారు. ఇందిరా, రాజీవ్ గాంధీలు కూడా ఆయనతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదని నట్వర్ వెల్లడించారు. -
కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరూ?: నట్వర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి నట్వర్‌సింగ్ మరోసారి తన మాటల తూటాలను ఎక్కుపెట్టారు. ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యులెవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇందిరగాంధీకి 181 సీట్లు వచ్చాయని నట్వర్ సింగ్ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి సోనియా, రాహుల్ బాధ్యులు కాదా అని ఆయన మరోసారి ప్రశ్నలు సంధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకమైనవన్నారు. నట్వర్‌సింగ్ ఆత్మకథ (వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ)పుస్తకం శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సోనియా లక్ష్యంగా పుస్తకం రాయలేదని స్పష్టం చేశారు. 2011 ఆఖరులో పుస్తకం రాయడం మొదలుపెట్టానని, అయితే పుస్తకం రాయడం పూర్తయ్యేవరకూ ఏ విషయాన్ని తాను బయట పెట్టలేదు. సోనియా గాంధీ ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారన్నది సరికాదని, నానమ్మ, తండ్రిని పోగొట్టుకొని..తల్లిని పోగొట్టుకోలేన్నారని, రాహుల్ ....సోనియా విషయంలో సరైన నిర్ణయమేనన్నారు. ప్రియాంకా వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందన్నారు. పెద్దలను గౌరవించటం భారతీయ సంప్రదాయమని, అయితే కాంగ్రెస్‌లో తనకు సరైన గౌరవం దక్కలేదని నట్వర్ సింగ్ అన్నారు. నిజాలు బయటపెట్టవద్దని ప్రియాంక గాంధీ కోరారని, కాంగ్రెస్‌లో జరిగిన అవమానానికి ఆమె క్షమాపణ చెప్పారని ఆయన తెలిపారు. ఇక శ్రీలంక విషయంలో తప్పు జరిగిందన్నది వాస్తవమని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. శ్రీలంకకు శాంతి సైన్యం పంపిన విషయాన్ని రాజీవ్ గాంధీ కేబినెట్‌తో సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను నరేంద్ర మోడీని కలిసింది బీజేపీతో ఒప్పందం కోసం కాదని నట్వర్ సింగ్ తెలిపారు. మోడీకి విదేశీ వ్యవహారాలపై సలహా ఇచ్చేందుకే కలిసినట్లు ఆయన తెలిపారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు అవసరమని చెప్పానని, మోడీ నాయకుడిగా విజయవంతమయ్యారని ప్రశంసించారు. మోడీ ప్రధాని కావటానికి వసుంధరా రాజే పాత్ర కీలకమన్నారు. యూపీఏ హయాంలో ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. కాగా ప్రధాని నుంచి సోనియాకు ఫైళ్లు వెళ్లేవన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. -
నా జీవిత కథ నేనే రాస్తా...: సోనియా
న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ శాఖామంత్రి నట్వర్ సింగ్ ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’విడుదలకు ముందే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పుస్తకంలో సోనియాగాంధీ, రాహుల్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి కారణమయ్యాయి. తనపై చేసిన వ్యాఖ్యలపై సోనియా స్పందిస్తూ నట్వర్ సింగ్ కు చురకలంటించారు. ఓ ఆంగ్ల టెలివిజన్ చానెల్ రిపోర్టర్ సునీల్ ప్రభు కిచ్చిన ఇంటర్వ్యూలో నా జీవిత కథ నేనే రాస్తా. అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని సోనియా వ్యాఖ్యానించారు. సోనియా ప్రధాని కాకపోవడానికి వెనకున్న కారణాలను తన ఆత్మకథలో వివరించానని ఒక ఆంగ్ల వార్తాచానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.