సోనియాపై మరోసారి నట్వర్ వివాదస్పద వ్యాఖ్యలు!
సోనియాపై మరోసారి నట్వర్ వివాదస్పద వ్యాఖ్యలు!
Published Fri, Aug 1 2014 5:59 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్ నుంచి జాంబియా సీనియర్ నేత కెన్నెత్ కౌండాను మరో హోటల్ కు అమర్యాదపూర్వకంగా తరలించారు అని తన ఆత్మకథంలో నట్వర్ సింగ్ పేర్కొన్నారు.
స్వాతంత్రం సిద్ధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కౌండా బరకాంబ రోడ్డులోని లలిత్ సూరి హోటల్ లో బస చేశారు. లలిత్ సూరి హోటలో బస చేశారని తెలుసుకున్న సోనియా.. తనను పిలిచి కౌండాను ఒబెరాయ్ హోటల్ కు షిప్ట్ చేయాలని చెప్పారని తన ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో వెల్లడించారు.
ఏన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న కౌండాను ఈ సమాచారాన్ని చేరవేయడం బాధించిందని నట్వర్ తెలిపారు. ఇందిరా, రాజీవ్ గాంధీలు కూడా ఆయనతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదని నట్వర్ వెల్లడించారు.
Advertisement
Advertisement