
సాక్షి, భోపాల్ : దేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేసిన ఘనత ఆది శంకరాచార్యులకే దక్కుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్యులు అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భోపాల్‌లోని జన అభియాన్ పరిషద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆదిగురు ఏక్తా యాత్రను ప్రారంభించారు. ఆదిగురు ఏక్తా యాత్ర 32 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
జగద్గురువులు ఆది శంకరాచార్యులు నడయాడిన ఓంకారేశ్వర్ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చౌహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment