రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం | India Deals About Two Hundred Crore With Russia | Sakshi
Sakshi News home page

రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం

Published Sun, Jun 30 2019 6:45 PM | Last Updated on Sun, Jun 30 2019 7:47 PM

India Deals About Two Hundred Crore With Russia - Sakshi

న్యూఢిల్లీ : యుద్ధ ట్యాంకులకు సంబంధించి భారత్‌-రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శనివారం భారత్‌-రష్యాల మధ్య రూ.200కోట్ల విలువైన యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎమ్‌ఐ-35/25 అటాక్ హెలికాప్టర్ల కోసం స్ట్రుమాట్కా యాంటీ ట్యాంక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందం చేసుకోనున్నట్లు ఇదివరకే ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు .

ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడు నెలల్లో ఇజ్రాయిల్‌ రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కింద ఆయుధాల సరఫరా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్షిపణలు ఒప్పందం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాంటీ ట్యాంక్‌ క్షిపణులు ఎమ్‌ఐ-35 చాపర్లకు యుద్ద సయయంలో అదనపు శక్తిని సమకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందంతో దశాబ్ద కాలంగా రష్యా క్షిపణులను సొంతం  చేసుకోవాలన్న  భారత్‌  కల నెరవేరినట్టయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement