anti tank missiles
-
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్‌లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
రష్యాతో భారత్ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ : యుద్ధ ట్యాంకులకు సంబంధించి భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శనివారం భారత్-రష్యాల మధ్య రూ.200కోట్ల విలువైన యాంటీ ట్యాంక్ మిస్సైల్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎమ్ఐ-35/25 అటాక్ హెలికాప్టర్ల కోసం స్ట్రుమాట్కా యాంటీ ట్యాంక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందం చేసుకోనున్నట్లు ఇదివరకే ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు . ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడు నెలల్లో ఇజ్రాయిల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ కింద ఆయుధాల సరఫరా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్షిపణలు ఒప్పందం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎమ్ఐ-35 చాపర్లకు యుద్ద సయయంలో అదనపు శక్తిని సమకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందంతో దశాబ్ద కాలంగా రష్యా క్షిపణులను సొంతం చేసుకోవాలన్న భారత్ కల నెరవేరినట్టయింది. -
భారత ఆర్మీకి ‘నాగ్’ శక్తి
న్యూఢిల్లీ : 300 నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను భారతీయ ఆర్మీ తీసుకోనుంది. 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల యుద్ధట్యాంకులను నాగ్ క్షిపణి నాశనం చేయగలదు. 1980వ దశకంలో 5 రకాల క్షిపణులను భవిష్యత్ అవసరాల కోసం అభివృద్ధి చేయాలని భారత్ భావించింది. వాటిలో నాగ్ క్షిపణి కూడా ఒకటి. అయితే, ఆ తర్వాత పలు రకాల కారణాల వల్ల నాగ్ క్షిపణుల అభివృద్ధి ఆలస్యం అవుతూ వచ్చింది. రక్షణ శాఖ అధికారుల సమాచారం మేరకు 300 నాగ్ క్షిపణులు, 25 నాగ్ మిస్సైల్ కారియర్స్(నామికా)ను భారత ఆర్మీ తీసుకోనుంది. నామికా ద్వారా ఒకేసారి ఆరు నాగ్ క్షిపణులను ప్రయోగించొచ్చు. నాగ్ క్షిపణుల పరీక్షించిన తర్వాత ఆర్మీ 3 వేల క్షిపణులను తీసుకునే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రు యుద్ధట్యాంకులను నాశనం చేయగల సామర్ధ్యం నాగ్ మిస్సైల్స్ సామర్ధ్యం. అందుకే వీటిని ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి అంటారు. -
పాక్ బంకర్లు ధ్వంసం!
భారత బలగాల దాడి న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖవెంబడి ఉన్న పాకిస్తాన్ బంకర్లను భారత బలగాలు ధ్వంసం చేసినట్లుగా చూపిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, గతవారం జమ్మూ సరిహద్దుల్లో ఇద్దరు భారత జవాన్ల తలలు తెగనరికిన ఘటనకు ముందే ఈ దాడి జరిగినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ ట్యాంకులు, యాంటీ–ట్యాంక్ మిసైల్‌ల ద్వారా పాక్ బంకర్లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు ఈ వీడియోల్లో స్పష్టమైంది. ఈ వీడియోలో భారత జవాన్ల మాటలు (భావిస్తున్నారు) వినిపించాయి. మిసైల్లు వరుసగా బంకర్లను ధ్వంసం చేయగానే జవాన్లు మాట్లాడుకున్న ‘ట్యాంక్ కా (షెల్) లగ్ గయా, గిరాదియా (షెల్ లక్ష్యాన్ని తాకింది, పడగొట్టేసింది). హాజీ, హాజీ (అవునవును)’ అని వినిపించింది. మరో బంకరు ధ్వంసం కాగానే.. ‘ ఆగయా ట్యాంక్ కా.. ఏక్బా ఆగయా (షెల్ అనుకున్న పని పూర్తిచేసింది)’ అని హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కడ ఈ దాడి జరిగిందనేది స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే.. గతనెల్లో (ఏప్రిల్)లో ఈ పాక్ బంకర్ల విధ్వంసం జరిగి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. -
పాక్ బంకర్లు.. తునాతునకలు!