వైద్య పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాలి
వైద్య రంగంలో మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
ఎయిమ్స్ స్నాతకోత్సవంలో వైద్యులకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ:వైద్య పరిశోధనల రంగంలో భారత్ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
సోవువారం ఎయిమ్స్ 42వ స్నాతకోత్సవంలో ఆయన పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని, వాటికి అనుగుణంగా మనదేశంలో వైద్యులు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని సూచించారు.
భారత దేశానికి చెందిన వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, అయితే మనదేశం మాత్రం పరిశోధనల రంగంలో చాలా వెనుకబడి ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రొఫెసర్లు తాము చదివిన పాత పుస్తకాలనే ఇప్పుడు తమ వైద్య విద్యార్థులకు సూచిస్తున్నారని, అందువల్ల మార్పులకు అనుగుణంగా వారు ముందడుగు వేయలేకపోతున్నారని చెప్పారు. వైద్యులు ఈ రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎయిమ్స్ నుంచి బయుటకు వెళ్లగానే అంతా అయిపోయిందని పట్టభద్రులు అనుకోరాదని, నిరంతరం కొత్త విషయూలు నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. ఎయిమ్స్‌లో చదివిన 40 శాతం మంది డాక్టర్లు విదేశాలకు వెళ్లిపోతున్నారని ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తూ.. ‘మీరు ఈ స్థాయికి రావడానికి దేశం ఎంతో వెచ్చించింది’ అనే విషయూన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మనకోసం ఎంతో చేసిన దేశానికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. ‘మివ్నుల్ని ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన సమాజానికి ఉపయోగపడేలా పనిచేయుండి’ అని వైద్యులకు మోదీ సూచించారు. ఏడాదిలో కనీసం ఒక వారంపాటు మారుమూల ప్రాంతాల్లో పేదల కోసం పనిచేయూలని కోరాారు.
ఎయిమ్స్ వంటి ఉన్నతస్థాయి సంస్థలో చదువుకున్నందుకు ఎంతో అదృష్టవంతులని ఆయున పట్టభద్రులనుద్దేశించి అన్నారు. ఇలాంటి స్నాతకోత్సవాలకు పేద విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు ఎంతో స్ఫూర్తి పొందుతారని ప్రధాని అన్నారు. రానున్న రోజుల్లో వైద్య రంగాన్ని వురింతగా అభివృద్ధి చేస్తావుని అన్నారు. తన ప్రసంగం ముగింపు సందర్భంగా మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నేను రోగిని కాదు అలాగే వైద్యుడినీ కాదు. అలాంటప్పుడు ఈ స్నాతకోత్సవానికి నన్ను ఎందుకు ఆహ్వానించారో అర్థం కావడంలేదు. కేవలం ప్రధానమంత్రి అయినందుకే నన్ను ఆహ్వానించారు. అన్నిచోట్లా రాజకీయు నాయకులకే పెద్ద పీటవేయడం దురదృష్టకరం’ అని మోదీ అన్నారు.
వైద్యులకు జీవిత సాఫల్య పురస్కారం
తవు సంస్థలో పనిచేసిన వైద్యులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందించాలని ఎయిమ్స్ సంస్థ నిర్ణయించింది. మొదటిసారిగా 42వ స్నాతకోత్సవంలో ఈ అవార్డులకు శ్రీకారం చుట్టింది. ఎయిమ్స్‌కు చెందిన మాజీ వైద్యులతోపాటు మెడికల్ సైన్స్ రంగంలో విశేష సేవలందించిన పలువురికి ప్రధాని మోదీ ఈ పురస్కారాలను అందజేశారు.