అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థారుులో 25 శాతం పెరిగింది.
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థారుులో 25 శాతం పెరిగింది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికాలో 1,65,918 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనోళ్లు రెండో స్థానంలో నిలిచారు. మునుపెన్నడూ లేనంత రికార్డు స్థారుులో ఈ సంఖ్య నమోదైందని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ అధ్యయనం జరిపిన 2016 ఓపెన్ డ్రూప్స్ నివేదిక పేర్కొంది.
అమెరికాలో కాలేజీలు, వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఏడు శాతం పెరిగి, ఈ అకడమిక్ సంవత్సరంలో ఒక మిలియన్‌ను దాటింది. మొత్తం 10,44,000 మందిగా నమోదై అమెరికా జనాభాలో ఐదు శాతంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అమెరికాలోని స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ట్రూప్స్ నివేదికను ప్రచురిస్తోంది.